విజయవాడ

గుటక గుటకకూ బాదుడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 27: రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న నగర ప్రజలపై నీటి చార్జీల భారానికి రంగం సిద్ధవౌతోంది. గుటక గుటకకూ చార్జీలు వసూలు చేయాలన్న ఆలోచనలకు నగర పాలకులు పదునుపెడుతున్నారు. నీటి సరఫరాకు అయ్యే ఖర్చుకు అనుగుణంగా ఆదాయం పొందడానికి వడివడిగా అడుగులేస్తున్నారు. ప్రజలకు అసరమైన కనీస సౌకర్యాలలో అగ్రభాగానుండే నీటి సరఫరాను వ్యాపారంగా మార్చుతూ ఆదాయ పొందాలని చూస్తున్న నగర పాలక సంస్థ గుటక గుటకకూ చార్జీలు వసూలు చేయాలన్న సమాలోచనలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నారు. ప్రజా సౌకర్యార్ధం పేరిట నిరంతర నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్న నగర పాలకులు, నీటి సరఫరా చేస్తే ప్రజలు చెల్లించే ప్రస్తుత నీటి పన్నుకు నీటి తదుపరి చెల్లించే నీటి చార్జీలకు గల వ్యత్యాసాలపై నివేదికల రూపకల్పనలకు తలామునకలవుతున్నారు. ఈమేరకు మంగళవారం విఎంసి కమిషనర్ జె నివాస్ తన క్యాంప్ కార్యాయలంలో జరిగిన సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ అర్భన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎపియుఐఎఎంఎల్) నగరంలోని మూడు సర్కిల్స్ పరిధిలో మొత్తం 19 డివిజన్లలో 24/7 నిరంతర నీటి సరఫరాకు ఆ సంస్థ రూపొందించిన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు సంబంధించి డిజైన్ చేసిన ప్రాంతాలను పరిశీలించి ఆయా వివరాలను అడిగి తెలుసుకున్నారు. విఎంసి కమాండ్ కంట్రోల్‌కు ఈ నెట్‌వర్క్‌ను అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియకు ఖర్చు ఎంత అవుతోంది, ఖర్చు నిధుల సమీకరణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించిన అనంతరం సమగ్ర నీటి పన్ను విధానాలను కూడా అందజేయాలన్నారు. ఈ సమీక్షలో విఎంసి సిఇ ఇన్‌ఛార్జ్ పి ఆదిశేషు, ఎస్‌ఇ జెవి రామకృష్ణ, ఎపియుఐఎఎంఎల్ కన్సల్‌టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.