విజయవాడ

అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, సెప్టెంబర్ 19: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, దీంతో ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నాయని శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ అన్నారు. మంగళవారం ఉదయం పటమట 12వ డివిజన్‌లోని ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. దర్శిపేట, పూజిత అపార్ట్‌మెంట్స్ తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఇళ్ళులేని పేదలందరికి 26 వేలు ఇళ్ళను ఇవ్వటానికి శంకుస్థాపన చేయటం ప్రారంభించారని, ఇంకా 50 వేల ఇళ్ళకు స్థల సమీకరణ జరుగుతుందన్నారు. రానున్న 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క పేదవారికి ఇళ్ళు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఉద్ధేశ్యమన్నారు. ప్రతిపక్షాలు అధికార పీఠం కోసం ప్రాకులాడుతున్నారని, అధికార పీఠాన్ని కళ్ళతో చూసే అవకాశం కూడా ప్రజలు ఇవ్వరని ఆయన ఎద్దెవా చేశారు. కార్పొరేటషన్‌లో ఒక్క కార్పొరేటర్ సీటు గూడ గెలవని పార్టీలు తమ ఉనికిని కోల్పోయారని అన్నారు. ధర్నాలకే పరిమితమయ్యే పార్టీలను నమ్మి కొంత మంది ప్రజలు మోసపోతున్నారని నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు మాత్రమే నన్నారు. అంతకుముందు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో మాజీ మేయర్ తాడి శంకుతల, కో ఆప్షన్ సభ్యులు చెన్నుపాటి ఉషారాణి తదితరులు అనందంతో నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అన్నాభత్తుల బాబి, ముమ్మనేని ప్రసాద్, కోగంటి రామారావు, సగ్గుర్తి రమేష్, రేపాకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వైసిపికీ విపక్ష హోదానూ దక్కదు
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఆ పార్టీ నాయకుల మాటలను నమ్మె స్ధితిలో ప్రజలు లేరని అర్బన్ టిడిపి అధికార ప్రతినిధి ముమ్మనేని ప్రసాద్, మూడో డివిజన్ టిడిపి అధ్యక్షుడు నందిపాటి దేవానంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంపై 3వ డివిజన్ వైకాపా పార్టీ కార్పొరేటర్ బొప్పన భవకుమార్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వారు ఖండించారు.

నాలుగు నెలలుగా డీలర్ల వద్దే కిరోసిన్
పాతబస్తీ, సెప్టెంబర్ 19: నగరంలోని కిరోసిన్ డీలర్ల వద్ద వేలాది లీటర్ల కిరోసిన్ నాలుగు నెలలుగా స్టాక్ అలాగే ఉండిపోయింది. 350 మంది కిరోసిన్ డీలర్లు ఉండగా వారంతా నాలుగు నెలల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిన స్టాక్ నగదు చెల్లించి కిరోసిన్ తెచ్చుకున్నారు. వినియోగదారులు ఆ కిరోసిన్‌ని తీసుకెళుతున్న సమయంలో పౌర సరఫరాశాఖ అధికారులు కిరోసిన్ అమ్మకాలను ఆపేయాలని ఆదేశించారు. దాంతో సుమారు వేలాది లీటర్ల కిరోసిన్ డ్రమ్ముల్లోనే నిల్వ ఉంచాల్సి వచ్చింది. కిరోసిన్ అమ్మకాలు ఆపాలని ఆదేశించిన అధికారులు మిగిలిన స్టాక్‌ని ఇంత వరకు తిరిగి వెనక్కి తీసుకోలేదు. లేదా స్టాక్ ఉన్నంత వరకు అమ్మమనే ఆదేశాలూ ఇవ్వడంలేదు. పీపాల్లో కిరోసిన్ నెలలపాటు ఎండలో వానల్లో నిలువ ఉండడం వల్ల కొంత మేరకు ఆవిరౌతుందని డీలర్లు వాపోతున్నారు. స్టాక్‌ని అమ్మనివ్వరూ లేదా తిరిగి తీసుకోరూ, ఇలా చేయడం వల్ల డీలర్లు ఆర్థిక వెసులుబాటు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. స్టాక్ డీలర్ల వద్ద తిరిగి తీసుకోవడం కుదరదు గనుక ఉన్నంత సరుకుని అమ్మడానికి పౌర సరఫరాశాఖ అధికారులుగాని, జిల్లా జాయింట్ కలెక్టర్లుగాని అనుమతి ఇవ్వాలని డీలర్లు కోరుతున్నారు.