విజయవాడ

సమాజ గమనానికి నాటకాలు ప్రతిబింబాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: సమాజ స్థితిగతులకు, గమనాగమనాలకు నాటకాలు అద్దం పడతాయని, అలాంటి నాటకాలు, నాటికల్లో సమాజాన్ని చెక్కిన శిల్పి ఎస్‌కె మిశ్రో అని శాసనసభ ఉప సభాపతి డా మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా సృజనాత్మకత, సాంస్కృతిక సమితి, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అమరావతి కలిసి మధుమాలక్ష్మీ ఛాంబర్స్‌లోని కల్చరల్ సెంటర్‌లో ప్రముఖ నాటక రచయిత, నటులు, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత ఎస్‌కె మిశ్రో రాసిన రాసిన ‘రామాయణంలో రాయనిపుటలు’ అన్న నాటక, నాటికీల పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. సభకు అధ్యక్షతన వహించిన కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి డా జీవి పూర్ణచంద్ మాట్లాడుతూ ఆధునిక తెలుగు సాంఘీక నాటకరంగం కొత్త తలుపులు తెరుచుకోవటానికి కృషి చేసిన ప్రముఖుల్లో ఎస్‌కె మిశ్రో ఒకరన్నారు. రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి సీఈవో డా డి విజయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఆధునిక నాటక రంగ స్థలాన్ని ప్రభావితం చేసిన అగ్రశ్రేణి దర్శకులుగా నటులుగా ఎస్‌కె మిశ్రో విశిష్ట స్థానాన్ని పొందారన్నారు. డా ఎంసి దాస్ మాట్లాడుతూ మిశ్రో తనకు 50 ఏళ్లకుపైగా మిత్రుడనీ, తాము కళాభారతిలో నాటకాలు వేస్తున్నప్పటి నుంచి తెలుసనీ, తామిద్దరం కలిసి అక్కినేని కళాపీఠం గుడివాడలో డా తంబుతో నాటకరంగం మీద ఒక కార్యశాలను నిర్వహించామనీ అతడొక నటుడు, దర్శకుడు, రచయిత నటకాన్ని ఒక తప్పసులా భావిస్తాడనీ, తామిద్దరం కలిసి ఎన్నో టిసి సీరియల్స్‌లో నటించామని చెప్పారు. పుస్తకాన్ని సమీక్షించిన ఆంధ్ర లయోల కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. గుమ్మా సాంబశివరావు మిశ్రోకి సృజనాత్మక ప్రతిభ, సామాజిక విషయపరిశీలన, సంభాషణాత్మక శైలి వీరి నాటకాల్లో ప్రధానాంశాలనీ, సమకాలీన సమాజంలో ఉన్న సమస్యలను, లుప్తవౌతున్న మానవ సంబంధాలను, ఆలోచనాత్మకంగా నాటకీకరించటం ఆయన ప్రత్యేకతని, ఇతిహాసాల్లోని సందేహాలకు తనదైన రీతిలో ఆలోచనలను జోడించి, రామాయణానికి ఒక ప్రత్యేక వ్యాఖ్యానాన్ని రాసినట్లు ఈ పుస్తకంలోని నాటకాలు, నాటికలు సాగాయన్నారు. మరో సమీక్షకులు వల్లూరు శివప్రసాద్ మాట్లాడుతూ మిశ్రో కాలంతోపాటు పరిగెడుతున్న నాటక రచయిత అనీ సమాజంలోని అత్యాధునికాంశాలను కూడా నాటకీకరించిన ప్రతిభా వంతుడన్నారు. కల్చరల్ సెంటర్ సీఈవో డా ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ మిశ్రో బహుముఖ ప్రజ్ఞాశాలి అని గతాన్ని వర్తమానాన్ని నాటకాలు, నాటకల్లో ప్రభావవంతంగా రాయగల సమర్ధుడనీ, నటునిగా, దర్శకునిగా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు. అనంతరం మిశ్రోను బుద్ధప్రసాద్, విజయభాస్కర్‌లు ఘనంగా సత్కరించారు. రచయిత తన స్పందనలో తన పుస్తకానికి ఆర్థిక సాయాన్నందించిన ఆంద్రప్రదేశ్ సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సీఈవో డా విజయభాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ రచన, నటక ఊపిరిగా జీవిస్తున్న తనకు ఇలాంటి కార్యక్రమాలు మరింత ప్రోత్సాహాన్నందిస్తాయన్నారు. ఈమని శివనాగిరెడ్డి వందన సమర్పణ చేశారు. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి గోళ్ల నారాయణరావు, వెన్నా వల్లభరావు, పురాతన సంస్థ అధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు, మంచిరాజు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలకు తక్షణ పరిష్కారం
* డిఆర్‌ఎం ధనుంజయులు
విజయవాడ (రైల్వేస్టేషన్), సెప్టెంబర్ 19: ‘సమస్య మీది - పరిష్కరించే బాధ్యత మాది’ అనేది నినాదం కాదు, సిద్ధాంతమని విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ ధనుంజయులు అన్నారు. డివిజన్ పరిధిలోని విశాఖపట్నం వైపు దువ్వాడ దగ్గర నుంచి ఇటు చెన్నై వైపు గూడూర జంక్షన్ వరకు, బ్రాంచి లైన్‌లోని గుడివాడ - మచిలీపట్నం - నర్సాపూర్‌ల మధ్య ఉన్న మొత్తం డివిజన్‌లోని 18వేల మంది ఉద్యోగులకు ఉన్న సమస్యల పరష్కారం కోసం ఆన్‌లైన్, ఎస్‌ఎంఎస్ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే విధానాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలోని పర్సనల్ బ్రాంచి సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ నహేమియా నేతృత్వంలో ఏర్పాటు చేసిన విధానాన్ని డిఆర్‌ఎం ధనుంజయులు తన చాంబర్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ధనుంజయులు మాట్లాడుతూ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం వారున్న ప్రాంతాన్ని వదిలి తిరగవలసిన పనిలేకుండా పైన తెలిపిన మూడు మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ విధానాన్ని ఏర్పాటు చేశామన్నారు. వ్యక్తిగతంగా కలవాలనుకునే వారికి సైతం ప్రతిరోజు సాయంత్రం సమయాలు అందుకు ప్రత్యేకంగా కేటాయించామన్నారు. గతంలో సాధారణంగా పదవీ విరమణ చేసేవారికి చెందిన క్లైముల సెటిల్‌మెంట్‌లో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవేనన్నారు. అయితే నేడు అలాకాకుండా రిటైరైన ఒకటి, రెండురోజుల్లో తాను పొందుపరచిన బ్యాంక్ ఖాతాలోకి తనకు రావాల్సిన సొమ్ము జమ అవుతుందన్నారు. ఇదే తరహాలో ఉద్యోగంలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగి దగ్గర నుంచి మరే ఇతర కారణాల ద్వారా మరణించిన వారికి చెందిన సెటిల్‌మెంట్‌లు సైతం సత్వర పరిష్కారం చూపుతున్నామన్నారు. ఉద్యోగులు పనిచేసే స్టేషన్‌లలో వారి యూనిట్లలో సమస్యలు, ఫిర్యాదులకు చెందిన రిజిష్టర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇదే తరహాలో డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ఉద్యోగుల సౌలభ్య కోసం ఫిర్యాదుల పెట్టిని ఏర్పాటు చేయంచామన్నారు. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వారం నుంచి ఇరవై రోజుల్లోపు పరిష్కరించే విధంగా ప్రణాళికను రూపొందించామని డిఆర్‌ఎం రు. ఈసందర్భంగా పర్సనల్ బ్రాంచి రూపొందించిన ‘ఉద్యోగుల శ్రేయస్సే మా లక్ష్యం’ అనే కార్యక్రమంలో సీనియర్ డిపిఓ నహేమియాతో పాటు సంక్షేమ విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.