విజయవాడ

పేదలకు టిడిపినే అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, సెప్టెంబర్ 21: పేదలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి భరోసా ఇచ్చారు. సెంట్రల్ ని యోజకవర్గం 57వ డివిజన్‌లో ఇంటింటికి తెలుగుదేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజాసమస్యలను తెలుసుకున్నారు. ఈసందర్భం లో పలువురు నీటి, పారిశుద్ధ్యం, దోమ లు, విషజ్వరాల్ని ప్రముఖంగా మంత్రి, ఎమ్మెల్యే కొండా ఉమా దృష్టికు వివరించారు. ఈసందర్భంగా మంత్రి సుజానాచౌదరి మాట్లాడుతూ తమ దృ ష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే బొండా ఉమ సంబంధిత శాఖ అధికారులతో చర్చించి రోజుల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ ప్రజా సమస్యల ను వారి సమక్షానికి వెళ్లి తెలుసుకునేందుకే ఇంటింటి తెలుగుదేశం సిఎం చం ద్రబాబు ప్రవేశపెట్టారన్నారు. స్థానికం గా అధికారులు ఇళ్ల విషయమై ప్రస్తావించగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని, అర్హులకు అన్యా యం జరగదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపి కొ నకళ్ల నారాయణ, 57వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ జగదీష్, డివిజన్ అధ్యక్షు డు దడిగ సుబ్రహ్మణ్యం, డివిజన్ యు వత అధ్యక్షుడు బొల్లేద్దుల రవిచంద్ర యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్య కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచాలి
పటమట, సెప్టెంబర్ 21: వైద్య ఆరోగ్య శాఖలో 14ఏళ్లుగా కష్టపడి ప నిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు 2015 పిఆర్‌సి ప్రకారం జీతాలు పెంచి డిఎను మంజూరు చేయాలని తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయి స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్సార్ మూర్తి డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఇ.సి, ఎఎన్‌ఎంలకు 2015 స్కేల్స్ ప్రకారం జీతాలు పెంచాలన్నారు. 2002 నుంచి వీరు నియామ కం పొందారన్నారు. డిఎస్సీ ద్వారా ఎం పికైన 2500 మంది రాష్ట్రంలో కాం ట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, వీరికి 2005లో పిఆర్‌సి అమలు చేశారని, అదే విధంగా 2010లో కూడా పి ఆర్‌సి అమలు చేసి ప్రస్తుతం దాని ప్ర కారం బేసిక్ 10,020 ప్లస్ డిఏ 99.28 శాతం ప్లస్ హెచ్ ఆర్‌ఎ ఇస్తున్నారని, అదే విధంగా 2015 పిఆర్‌సి అమలు చేసి బేసిక్ 21,230 పేచేసి ప్లస్ డిఎ 22.008శాతం ప్లస్ హెచ్‌ఆర్‌ఎ ఇవ్వాలని ఆయన కోరారు. ఇదే విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను దృష్టికి ఉదయం 8 గంటలకు ఆయన నివా సం కలసి తెలియచేయటం జరిగిందన్నారు. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పదించారని, త్వరలో ము ఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హమీ ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో టిఎన్‌టియుసి కార్యదర్శి ఎం.్భనుమూర్తి, గౌరవ అధ్యక్షులు ఆర్ రామ్మోహనరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ వై.శ్రీనివాసరావు, చీఫ్ వైస్ ప్రసిడెంట్ శ్రీనివాసచార్యులు, వైస్ ప్రసిడెంట్ కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ప్రజలందరికీ లోకమాత దీవెనలందాలి
బెంజిసర్కిల్, సెప్టెంబర్ 21: శరన్నవరాత్రుల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలందరికీ వెఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్ష లు తెలిపారు. చెడు మీద మంచి సా ధించిన విజయానికి ప్రతీకగా జరుగపుకునే విజయదళమి పండుగకు ముందు, భక్తిశ్రద్ధలతో లోకమాతను కొలిచే పర్వదినాలు ఈ నవరాత్రులని జగన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లోకంలోని ప్రజలందరినీ రక్షిం చే దుర్గామాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ప్ర సాదించాలని అభిలషించారు.
బిజెపి కార్యాలయంలో..
విజయదశమి సందర్భంగా దేవ శరన్నవరాత్రులు ఎస్‌సిమోర్చా నగరశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్‌సి మోర్చా నగర అధ్యక్షుడు యలిశల శ్రీనివాసరావు దంపతు లు తొలిరోజు పూజలను నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షు డు దారా సాంబయ్య మరియు బిజెపి రాష్ట్ర నాయకుడు కన్నా లక్ష్మీనారాయ ణ, దాసం ఉమామహేశ్వరరాజు హాజ రై అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు. రాష్ట్రంలో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.