విజయవాడ

అవినీతి రహిత సమాజమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: అవినీతి రహిత సమాజ స్థాపనే తన ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. స్థానిక ఎ కనె్వన్షన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో రెండోరోజు గురువారం ఆయన 2017-2022 సంవత్సరాలకు రాష్ట్ర క్రీడా విధానాలపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. రెండోరోజు సదస్సును ఈ-ప్రగతిపై సమీక్షతో ప్రారంభించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అందరూ కలిసి పనిచేయాలని, అదికూడా సంతోషంగా పని చేయాలన్నారు. అవినీతిని నిరోధించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, నిరంతర నిఘా ఉంచాలన్నారు. ఇకపై ప్రతినెలా ఆయా జిల్లాల వారీగా వివిధ అంశాల పురోగతిపై రేటింగ్ పెడుతున్నట్లు తెలిపారు. పేదలకు న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. వచ్చే కలెక్టర్ల సమావేశాన్ని గ్రామస్థాయిలో కూడా సంబంధిత అధికారులు, సిబ్బంది వీక్షించి భాగస్వామ్యం అయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ-ప్రగతిని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాలని కలెక్టర్లకు, ఇతర అధికారులకు సూచించారు. రాష్టస్థ్రాయిలో ఈ-ప్రగతిపై శిక్షణ ఇవ్వడంతో పాటు ఏదైనా ఒక ఇంజనీరింగ్, ఎంబిఎ కాలేజీలను తీసుకుని విద్యార్థులకు ఈ-ప్రగతిపై శిక్షణ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో అక్టోబర్‌లో లక్ష ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పేదలకు పెద్దఎత్తున గృహ నిర్మాణాలు తలపెట్టిన కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు రాష్టవ్య్రాప్తంగా రెండు లక్షల సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్, జనవరి, జూన్ నాటికి నెలకు 2.50 లక్షల ఇళ్లు చొప్పున నిర్మాణం పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వపరంగా వైద్యరంగాన్ని ఎంతో వినూత్నంగా, పలు సంస్కరణలతో అభివృద్ధి పరుస్తున్నప్పటికీ తాను అనుకున్నంత ఫలితాలు రావడంలేదని ముఖ్యమంత్రి అన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రీడల్లో శిక్షణ, నైపుణ్యం గుర్తింపు కార్యక్రమాలు ముమ్మరం చేయాలని, రాష్టవ్య్రాప్తంగా 25 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 63 వచ్చే మార్చి నాటికి పూర్తవుతాయని తెలిపారు. 2019లో జాతీయ క్రీడోత్సవాలు మన రాష్ట్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ నుండి జనన, మరణాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇందుకోసం విధివిధానాలు రూపొందించాలని ఆయా శాఖల కార్యదర్శులకు చంద్రబాబు సూచించారు.
రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, గృహ నిర్మాణాల ప్రారంభానికి క్షేత్రస్థాయిలో సరైన నిర్మాణాలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో మురికివాడలకు ఆస్కారం లేకుండా సుందరంగా అభివృద్ధి పరచడమే జిల్లా కలెక్టర్లు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో 47శాతం విశ్వవిద్యాలయాలు న్యాక్ అక్రిడేషన్ పొందాయన్నారు. లక్షా 62వేల మంది విద్యార్థులు విద్యనభ్యసించేలా రూ. 15800 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా 11 విశ్వవిద్యాలయాలు ఏర్పాటవుతున్నాయన్నారు. వీటిలో 4 ప్రస్తుత విద్యా సంవత్సరం నుండి, మరో 7 వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు నిర్వహించనున్నాయని తెలిపారు. జాతీయ అక్షరాస్యతా రేటు 70శాతం కాగా, మన రాష్ట్రంలో అది 67.41 శాతంగా ఉందన్నారు. సమాజ వికాసానికి సామాన్య ప్రజల పురోగతి, విద్యా, ఆరోగ్యం ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశాలన్నారు.
ఉమెన్ హెల్ప్‌లైన్ బ్రోచర్ విడుదల
మహిళలు ఆపదలో ఉన్నప్పుడు ఈవ్‌టీజింగ్, గృహహింస, కట్న వేధింపులు, తదితర సమస్యల పరిష్కారానికి మహిళా హెల్ప్‌లైన్-181 ట్రోల్ ప్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెపుతూ ఇందుకు సంబంధించి బ్రోచర్‌ను విడుదల చేశారు. వైద్య, న్యాయ సహాయంతో పాటు వివాహానికి ముందు అవసరమైన కౌనె్సలింగ్‌ను మహిళలు పొందవచ్చన్నారు. ఎపి అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా రాష్టవ్య్రాప్తంగా నగరాలు, పట్టణాల్లో పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేసిన వారికి ఎపి గ్రీన్ అవార్డులు అందించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన బ్రోచర్‌ను విడుదల చేశారు. సదస్సులో ఉప ముఖ్యమంత్రులు కెఇ కృష్ణమూర్తి, నిమ్మకాలయ చినరాజప్ప, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, వివిధ శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.