విజయవాడ

ఎపిసిఆర్‌డిఏ ఓపెన్ ఫోరంలో 11 దరఖాస్తులకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: విజయవాడ ఏపిసిఆర్‌డిఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఓపెన్ ఫోరం లో భవనాలు, లే అవుట్ల దరఖాస్తుల ను ఎపి సిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చె రుకూరి శ్రీ్ధర్ స్వయంగా పరిశీలించి అన్ని నిబంధనలు పాటించిన వారికి అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతి మంజూరు చేశారు. విజయవాడ ఏపి సిఆర్‌డిఏ కార్యాలయంలో నిర్వహించి న ఓపెన్ ఫోరంలో మొత్తం 19 దరఖాస్తులు వచ్చాయి. నిబంధనలకు అనుగుణంగా ఉన్న 11 దరఖాస్తులను అ ప్పటికప్పుడే ఆమోదించి ప్రాథమిక అ నుమతి పత్రాలు అందించారు. మరో 7 దరఖాస్తులకు అదనపు సమాచారం కోరగా 1దరఖాస్తును తిరస్కరించారు.
వీటిలో భవన నిర్మాణ అనుమతుల కోసం 4 దరఖాస్తులు రాగా 2 దరఖాస్తులపై ప్రాథమిక అనుమతి మంజూ రు పత్రం జారీ చేశారు. 2 దరఖాస్తుల కు అదనపు సమాచారం కోరారు. ఆ క్యుపెన్సీ సర్ట్ఫికెట్ కోసం 7 దరఖాస్తు లు రాగా నిబంధనలకు అనుగుణంగా ఉన్న 5 దరఖాస్తులను ఆమోదించి సర్ట్ఫికెట్లను జారీ చేశారు. 2 దరఖాస్తుల కు అదనపు సమాచారం కోరారు. ప్రొ విజినల్ లే అవుట్ల అనుమతుల కోసం 4 దరఖాస్తులు రాగా, నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఒక దరఖాస్తును ఆమోదించారు. మరో రెండు దరఖాస్తులకు అదనపు సమాచారం కోరారు. ఒక దరఖాస్తును తిరస్కరించారు.
పరిశ్రమల అనుమతి కోసం 3 దరఖాస్తులు రాగా రెండు ఆమోదించారు. మరో దరఖాస్తుకు అదనపు సమాచారం కోరారు. ఎన్‌వోసీ కోసం ఒక దరఖాస్తు రాగా ఆమోదించారు. ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ఏపి సిఆర్‌డిఏ డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం జాయింట్ డైరెక్టర్లు కె ధనుంజయరెడ్డి, కె నాగసుందరి, బి బాలాజీ, సిఎల్‌యు అండ్ యుఆర్‌పి ప్రిన్సిపల్ ప్లానర్ వివిఎల్‌ఎన్ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

క్యూలైన్‌లో స్ప్రహతప్పి పడిపోయిన బాలిక
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 22: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో క్యూ లైన్‌లో మూడేళ్ళ బాలిక స్ప్రహ తప్పి పడిపోయింది. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న వనటౌన్ సిఐ కాశీవిశ్వనాథ్ స్పందించారు. స్వయంగా ఆయ న బాలికను ఎత్తుకుని వెంటనే తన వాహనంలో నగరంలోని ఆంధ్రా ఆస్పత్రిలో చేర్చారు. సకాలంలో వైద్యులు స్పందించి చికిత్స అందించారు. ప్రస్తు తం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.