విజయవాడ

భక్తుల సమస్యల పరిష్కారానికి సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 24: ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఏ చిన్న సమస్య ఎ దురైనా వెంటనే స్పందించి సులభంగా, త్వరితంగా పరిష్కరించేందుకు టీమ్ కృష్ణ యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం చెప్పారు. సమస్యలు లేని సంతోషకరమైన దర్శనాన్ని ప్రతి భక్తుడికి కలిగించడమే టీమ్ కృష్ణ యంత్రాంగం ప్రధాన ధ్యేయమన్నారు. ఇంద్రకీలాద్రిపై శనివారం భక్తులకు అందుతున్న సేవలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ముందుగా కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద లగే జి కౌంటర్, చెప్పుల స్టాండ్‌లను ఆకస్మి క తనిఖీ చేశారు. చెప్పుల స్టాండ్, లగే జీ కౌంటర్లలో ఎలాంటి రుసుము వ సూలు చేయకుండా భక్తులకు ఉచితం గా సేవలు అందించాలని అధికారుల ను ఆదేశించారు. రుసుం బోర్డులను స్వయంగా తొలగించారు. రుసుం వ సూలు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, తూనికలు, అగ్నిమాపక అధికారులతో నిఘా ఏర్పాటు చేస్తామ ని కలెక్టర్ హెచ్చరించారు. క్యూలైన్లో భ క్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. కొన్ని ప్రదేశాలలో కార్పెట్ సరిగా లేక భక్తులు ఇబ్బందులకు గురవుతుంటటం చూసి కార్పెట్ ఏర్పాటు చేయాల ని దేవాలయ అధికారులకు సూచించా రు. ప్రసాదం కౌంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్ భక్తులకు అవసరమైన మేర ప్ర సాదాలు అందించాలన్నారు. దర్శనం అనంతరం వృద్ధులు, వికలాంగుల కోసం అవసరమైతే అదనపు వాహనా లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని, వాటితో పాటు అత్యవసర మం దులను కూడా పూర్తిస్థాయిలో నిల్వ ఉంచుకోవాలని వైద్యాధికారులకు కలెక్టర్ ఆదేశించారు. అస్వస్థతకు భక్తులు గురైతే వైద్య సేవలు అందించడంతో పాటు మెరుగైన సేవలకు అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. శానిటేషన్‌పై పర్యవేక్షణకు జాయింట్ కలెక్టరును ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆలయ ఇవో సూర్యకుమారి, సబ్ కలెక్టర్ హరీష్, ఎసిపి రామకృష్ణ, తహశీల్దారు శివరావు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు లింగంభొట్ల దుర్గాప్రాద్, తదితరులు పాల్గొన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా టిడిపి ప్రభుత్వం
విజయవాడ, సెప్టెంబర్ 24: నవ్యాంధ్రప్రదేశ్‌లో బడుగు, బలహీన వర్గాల జీవన ప్రమాణాలను పెంచుతూ ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆదాయం వచ్చేలా తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోందని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి కుల వృత్తిదారుడు ఆత్మాభిమానంతో పట్టెడన్నం తినే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రతికూల శక్తులను అడ్డుకొని బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయం గా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. బిసిలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం క ల్పించాలనే ఉద్దేశంతో మంత్రివర్గంలో అత్యధికంగా 8 మంది బిసిలకు చోటు కల్పించడం జరిగిందన్నారు. మండలీకరణ ద్వారా దివంగత ఎన్టీ రామారా వు బిసిలకు న్యాయం చేస్తే ఆర్ధిక సం స్కరణలతో చంద్రబాబు బిసిలు అండ గా నిలబడుతుందన్నారు.
పదేళ్ల తల్లి, పిల్ల కాంగ్రెస్ పాలనలో బిసిలు అన్ని విధాలుగా మోసపోయా రు. గ్రామీణ వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభి న్నం అయింది. 2వేల మంది చేనేత కా ర్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనుకబడిన కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు.

డివైడర్‌ను ఢీకొని ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
పటమట, సెప్టెంబర్ 24: కెఎల్‌యు యూనివర్శిటీలో బిబిఎ మొదటి సంవత్సరం చదువుతున్న హార్తిక్ సచిచౌదరి (19), బిటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న పామురి వెంకట శేషసాయి యశ్వంత్ (21)లు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళుతూ ఐదో నెంబర్ బస్ రూట్‌లో డివైడర్‌ను ఢీకొని అనంతరం విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దుర్మరణం పాలైన సంఘటన మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానా రాష్ట్రానికి చెందిన హార్తిక్ సచి చౌదరి, హైదరాబాద్‌కు చెందిన యశ్వంత్ ఇద్దరూ స్నేహితులు కెఎల్‌యు యూనివర్శిటీలో చదువుతున్నారు. కాగా అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. మృతి చెందిన విద్యార్థులను ఉదయం కొత్త ప్రభుత్వ ఆసుపత్రి మార్చ్యురీకి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. హార్తిక్ సచిచౌదరి మృతదేహాన్ని బంధువులు హర్యానాకి తీసుకొని వెళ్లగా యశ్వంత్ మృతదేహాన్ని బంధువులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. విద్యార్థులు మృతి చెందటంతో కెఎల్‌యు యూనివర్శిటీలో విషాదచ్ఛాయలు నెలకొన్నాయి.