విజయవాడ

జగ్గయ్యపేట తహశీల్దార్ సస్పెండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: జిల్లాలో వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కలెక్టర్ బి.లక్ష్మీకాంతం కనె్నర్ర చేశారు. ఆదివారం ఒకేసారి వే ర్వేరు ఘటనల్లో ఇద్దరిపై వేటు వేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను జగ్గయ్యపేట తహశీల్దార్ డి.చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదివారం కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత ఇసుక విధానంకు సంబంధించి జగ్గయ్యపేట మండలం లో అవకతవకలకు పాల్పడినందులకు గాను తహశీల్దార్‌ను సస్పెండ్ చేశామ ని కలెక్టర్ తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్, విజయవాడ ఆర్‌డివో, ఎడి మై న్స్‌లు సంయుక్తంగా విచారణ చేపట్టి తహశీల్దార్ ఇసుక రవాణాకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ని వేదిక ఇచ్చారని కలెక్టర్ తెలిపారు. వారి నివేదిక ఆధారంగా జగ్గయ్యపేట తహశీల్దార్ డి.చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేశామని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు.
చంద్రన్న బీమా పథకం అమలుకు సంబంధించి అవకతవకలకు పాల్పడిన గుడివాడ పట్టణ బీమా మిత్ర చల్ల రామతులసిని విధుల నుండి తొలగించినట్లు కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలియజేశారు. చంద్రన్న బీమా పథకంలో ఒక వ్యక్తి మరణ అనంతరం నామినిగా తన పేరును నమోదు చేసుకుని వచ్చే డబ్బులకు సంబంధించి క్లెయిమ్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, అవకతవకలకు పాల్పడినట్లు రుజువు కావడంతో ఆమె ను విధుల నుండి తొలగించామని కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి పట్టణ స్థాయి ఫెడరేషన్ ఆమెను విధు ల నుండి తొలగించవలసిందిగా తీర్మా నం చేసిందని కలెక్టర్ అన్నారు. విచార ణ నిర్వహించి బీమా మిత్ర చల్ల రామతులసిపై క్రమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు.