విజయవాడ

తప్పు ఎవరిది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 24: నగరంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర సంచలనం రేపింది. మంచి భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయిన తీరు ఆయా కుటుంబాలను తీరని విషాదంలోకి నెట్టింది. ప్రమాదం జరిగినప్పుడు రికార్డయిన సిసి కెమేరా పుటేజీ దృశ్యాలు అధికారులకు నోటి మాట రాకుండా చేశాయి. కేవలం సెకన్ల వ్యవధిలో వాయు వేగంతో దూసుకువచ్చిన బైక్ క్షణాల్లో ఇద్దరిని మింగేసింది. ఘటన జరిగే నాటికి బైక్ సుమారు 170 కిలోమీటర్ల వేగంలో వెళ్తున్నట్లు స్పీడోమీటరు బట్టి స్పష్టమవుతోంది. ఇప్పుడు నగరంలో ఇదే చర్చ కొనసాగుతోంది. మంత్రి నారాయణ కుమారుడు రితేష్ హైదరాబాద్‌లో అర్ధరాత్రి మెట్రో పిల్లర్ ఢీకొని మృత్యువాత పడిన ఘటన గుర్తు చేసుకుంటున్నారు. అయితే సదరు యువకులు బైక్‌పై వెళ్తున్నందున హెల్మెట్ ధరించి ఉంటే కనీసం ప్రాణాలైనా దక్కేవని అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద దుర్ఘటన జరిగిపోయింది. దీనికి కారకులెవరు..? ఈ తప్పు ఎవరిది అనే ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. యువకులు మితిమీరిన వేగంతో అర్ధరాత్రులు దూసుకెళ్తూ రోడ్లపై వారు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా.. పక్కన వెళ్లేవారికి సైతం హాని చేస్తున్నారనడంలో సందేహమే లేదు. ఆధునాతన స్పోర్ట్స్ బైక్‌లు 399 సిసి వేగంతో నడిచే సామర్ధ్యం కలిగిన ఖరీదైన మోటారు సైకిళ్లు యువకుల చేతికి ఇచ్చిన తల్లిదండ్రులూ కారకులే. బైక్ చేతికి వచ్చాక ఇక గాలిలోనే దూసుకెళ్లే యువత కూడా కనువిప్పు కలగాలి. వేగ నియంత్రణ పాటించాలి. భద్రత కోసం హెల్మెట్ ధరించాలి. ఇలాంటి ప్రధానమైన జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల బారిన పడిన సమయంలో కనీసం ప్రాణాలతోనైనా బయటపడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. మొగల్రాజపురంలో అర్ధరాత్రి డివైడర్‌ను ఢీకొని క్షణాల్లో అక్కడికక్కడే మృతి చెందిన యశ్వంత్, రితిక్ చౌదరిల మరణం అత్యంత దయనీయం. ప్రమాదం జరిగిన తీరు పట్ల నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ తీవ్రంగా స్పందించారు. కనీసం ప్రాణాలతోనైనా ప్రమాదం నుంచి బయటపడేలా హెల్మెట్ వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటీవల కమిషనరేట్ పరిధిలో నగర పోలీసుశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేపట్టింది. అయినా పట్టించుకోని వాహన చోదకులు, ముఖ్యంగా యువత హెల్మెట్ ధారణకు మొగ్గు చూపకపోవడంతో తాజా ఘటనలకు ఆస్కారం ఏర్పడుతోంది. రితేక్, యశ్వంత్ మరణం పట్ల సీపి సవాంగ్ విచారం వ్యక్తం చేశారు. ఇక నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని ఆయన మీడియా ఎదుట ప్రకటించారు. పెట్రోలు బంకుల్లో కూడా హెల్మెట్ లేనిదే పెట్రోలు కొట్టకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, 2 రోజుల్లో అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు. మరోవైపు హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తూ ధరించని వారిపై జరిమానాతోపాటు కేసులు నమోదు చేస్తామని, తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలకు అధిక సామర్థ్యం ఉన్న బైక్‌లు ఇవ్వరాదని విఙ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా మృత్యువాత పడిన యశ్వంత్, రితిక్‌ల మృతదేహాలకు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్ కళ్లు అతని తల్లిదండ్రులు దానం చేశారు. ప్రమాద ఘటనాతీరును దర్యాప్తు అధికారులు విశే్లషిస్తున్నారు. పుష్పా హోటల్ సెంటర్ వైపు నుంచి వెళ్తూ మధ్యలో మృత్యువాత పడిన తీరు.. రికార్డయిన సిసి కెమేరా పుటేజీల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రేపటి నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఇప్పటికే సీపి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.