విజయవాడ

సిఎం చెప్పినవన్నీ కచ్చితంగా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 16: నగరంలో సుడిగాలి పర్యటన జరిపిన సిఎం చంద్రబాబు నాయుడు నగరాభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చెప్పిన సూచనలన్నీ తు.చ.తప్పక అమలుచేయాలని మేయర్ కోనేరు శ్రీ్ధర్ అన్నారు. సోమవారం ఉదయం అదనపు కమిషనర్ (జనరల్) డి చంద్రశేఖర్, పలువురు హెచ్‌వోడిలతో నిర్వహించిన సమీక్షలో సిఎం పర్యటనలో చెప్పిన పనులన్నీ కచ్చితంగా కార్యరూపం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నగరంలో అపరిశుభ్రత, పారిశుద్ధ్యం, నగర నదీకాల్వగట్ల శానిటేషన్, గ్రీనరీ అభివృద్ధి తదితర అంశాలలో మరింత మెరుగుపర్చాలని సూచించిన మీదట, ఆయా సూచనలకనుగుణంగా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సింగ్‌నగర్ ఎక్సెల్ ప్లాంట్‌లోని పేరుకుపోయిన చెత్త తరలింపులో ఎటువంటి జాప్యం లేకుండా కాంట్రాక్ట్ ఒప్పందం ప్రకారం సకాలంలో తరలించాలన్నారు. కాల్వగట్ల వెంబడి వేస్తున్న చెత్త చెదారం వేయకుండా విస్తృత చర్యలు తీసుకోవాలని తెలిపిన ఆయన నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా అభివృద్ధి పర్చాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్లాస్టిక్ విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ చేసి కౌన్సిల్ తీర్మానాన్ని తూచా తప్పకుండా అమలుచేయాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో సిఎంహెచ్‌ఓ బాబూ శ్రీనివాస్, టిడిపి ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, కార్పొరేటర్ కొణపర్తి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా అంతటా మెరుగైన స్థాయిలో
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

విజయవాడ, అక్టోబర్ 16: జిల్లాలో ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పౌర సరఫరాలు లాంటి శా ఖల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జిల్లా అంతటా మెరుగైన స్థాయిలో అమలు జరుగుతున్నాయని కలెక్టర్ బి లక్ష్మీకాంతం అ న్నారు. సోమవారం కలెక్టర్ తన క్యాం పు కార్యాలయంలో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేం ద్రాలు ఏర్పాటుల వివిధ గ్రామాల్లో 635 అనుమతులు మంజూరు చేయగా 211 నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపా రు. వీటి కుంటలు తవ్వకంలో 12వేలు లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు 9,400 తవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో వర్మికంపోస్టు కేంద్రాల నిర్మాణాల్లో 5,500 లక్ష్యంగా కాగా 5432 నిర్మించడం ద్వారా జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థా నంలో ఉందన్నారు. 945 ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ విభాగం లో అక్టోబర్ నాటికి 187 కి.మీ సిమెం ట్ రోడ్ లక్ష్యం కాగా ఇప్పటికే 224 కి.మీ నిర్మించడం జరిగిందన్నారు. వ నం - మనం కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 2.34 కోట్ల మొక్కలను నాటగా నవంబర్ నాటికి 5 కోట్ల మొ క్కలను నాటే లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. వ్యవసాయ శాఖ పరిధిలోని ఇక్రాఫ్ బుకింగ్, నాట్లు వేయ డం, పీడ్స్, పంట రుణాలు, మీ కోసం లాంటి పనుల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడం జరిగిందన్నా రు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న అం గన్‌వాడీ కేంద్రాల స్వంత భవనాలు 120 లక్ష్యానికి గాను 109 కేంద్రాల భ వనాలు చివరి దశలో ఉన్నాయన్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగు పెన్షన్ల తో అవెన్యూ ప్లాంటేషన్ వేయడంలో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంద న్నారు. గృహ నిర్మాణం, ఎపిఎంఐపి, ఉద్యానవన శాఖ, అటవీశాఖ పనితీరు అసంతృప్తిగా ఉందని ఆయా శాఖల అధికారులు మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. స మావేశంలో డిఆర్‌డిఎ పీడీ, డిడి చంద్రశేఖరరాజు, హౌసింగ్ పీడీ వి ప్రసాద్, డ్వామా పీడీ జ్యోతిబసు, అటవీ శాఖా ధికారి బెనర్జీ, అధికారులు పాల్గొన్నారు.