విజయవాడ

21 నుంచి అంతర్ వర్శిటీల హ్యాండ్‌బాల్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 17: సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నున్నలోని వికాస్ విద్యాసంస్థలలో నిర్వహించనున్నట్లు కృష్ణా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు ఆరు రాష్ట్రాల నుంచి 60 యూనివర్శిటీ జట్లు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇందుకోసం వికాస్ వ్యాయామ విద్యా కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నున్నలోని వికాస్ బిపిఈడి కాలేజీలో హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ కోసం గ్రౌండ్ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించి, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రామకృష్ణారావు మాట్లాడుతూ సౌత్‌జోన్‌లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి 60 యూనివర్శిటీ జట్లు వస్తాయన్నారు. గత ఏడాది సౌత్‌జోన్ చాంపియన్ పెరియార్ యూనవర్శిటీతోపాటు అన్నామలై, భారతీదాసన్, అలగప్ప యూనివర్శిటీ జట్లు కూడా పాల్గొననున్నట్లు తెలిపారు. ఐదు రోజులపాటు జరిగే ఈ పోటీలను నాకౌట్ కమ్ లీగ్ విధానంలో నిర్వహిస్తామన్నారు. మ్యాచ్‌ల నిర్వహణ కోసం నాలుగు కోర్టులను సిద్ధం చేస్తున్నామన్నారు. పోటీలకు వచ్చే జట్లకు కాలేజీ ఆవరణలో ఉచిత వసతి సౌకర్యం కల్పించటంతోపాటు మెడికల్ కిట్‌లను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇండియన్ యూనివర్శిటీ అసోసియేషన్ ఈసారి సౌత్‌జోన్ పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నీని కృష్ణా యూనివర్శిటీకి కేటాయించగా పోటీలను నిర్వహించేందుకు వికాస్ బిసిఈడి కాలేజీ ముందుకొచ్చిందన్నారు. మొదటి నాలుగు స్థానాలు సాధించిన జట్లు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జబల్‌పూర్‌లోని రాణి దుర్గావతి యూనివర్శిటీలో జరగనున్న అంతర్ మండల హ్యాండ్‌బాల్ టోర్నీలో పాల్గొంటాయన్నారు. కృష్ణా యూనివర్శిటీ క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే ఈ ఏడాది నుంచి క్రీడలకు రూ. 50 లక్షల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. వికాస్ విద్యా సంస్థల చైర్మన్ నరెడ్ల నర్సిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో తొలిసారిగా సౌత్‌జోన్ టోర్నమెంట్‌కు తమ కాలేజీ అతిధ్యం ఇస్తోందన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కృష్ణాజిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. విలేఖర్ల సమావేశంలో వికాస్ విద్యా సంస్థల కార్యదర్శి, కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి, కృష్ణా వర్శిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, వికాస్ బిపిఈడి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ రాజు పాల్గొన్నారు.

అగ్నిప్రమాదంలో వస్త్ర దుకాణం దగ్ధం
విజయవాడ, అక్టోబర్ 17: స్థానిక బందరు రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. షాపు మొత్తం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం బందరు రోడ్డులోని హోటల్ డివి మనార్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నంబూరి వంశీ అనే వ్యక్తి రేకుల షెడ్డు ఏర్పాటు చేసి కొద్ది రోజులుగా హజారా క్లాత్ స్టోర్ పేరుతో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. యధావిధిగా ఇద్దరు వ్యక్తులు మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో షాపులోని సరుకును సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో షాపు వెనుక భాగం నుంచి పెద్దఎత్తున పొగ రావడాన్ని సమీపంలో ఉన్న ఓకే శిల్క్స్ వాచ్‌మన్ కొండలరావు గుర్తించి వారికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు పరిశీలించగా దట్టమైన పొగతో పాటు మంటలు కూడా చెలరేగాయి. దీంతో వారు భయంతో బయటకు పరుగులు తీసి, యజమానికి సమాచారం ఇచ్చారు. షాపులో అన్నీ వస్త్రాలే కావడంతో 20 నిమిషాల్లో కాలిపోయాయి. సమీపంలో ఉన్న రెండు హోటళ్లు పొగతో నిండిపోయాయి. స్థానికులు, బందరు రోడ్డుపై ప్రయాణించేవారు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని, రూ.12 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని వంశీ తెలిపారు. డిసిపి రమణకుమార్, మాచవరం సిఐ ఉమామహేశ్వరరావు, అగ్నిమాపక శాఖాధికారులు పరిశీలించారు.