విజయవాడ

హత్య కేసుల్లో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 17: పటమట పోలీస్టేషన్ పరిధిలో ఈనెల 9వ తేదీ జరిగిన మహిళ హత్య, నగలు దోపిడి కేసులో నిందితుడిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తూ అవమానపాలు చేస్తున్నందున అడ్డు తొలిగించినట్లు జాయింట్ సీపి బివి రమణకుమార్ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రామవరప్పాడులోని కొల్లా వారి వీధిలో గత ఏడాదిగా అద్దెకుంటున్న శ్రీసత్య కళ్యాణి ఈనెల 9వ తేదీ తన ఇంట్లోనే బెడ్‌పై దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. భర్త చనిపోవడంతో ప్రకాశం జిల్లా నుంచి విజయవాడ వచ్చిన కళాయణి ఇక్కడ ఒంటరిగా అద్దెకుంటోంది. తన భర్త మరణించగా వచ్చిన డబ్బుతో ఇక్కడ ఉంటూ వడ్డీ వ్యాపారం చేస్తోంది. ఈక్రమంలో ఈమెకు పరిచయమైన టేకు శ్రీను అలియాస్ చిన్నా అనే వ్యక్తి ఇమె వద్ద కొంత నగదు అప్పు తీసుకున్నాడు. కాకినాడకు చెందిన శ్రీను పదేళ్ళుగా రామవరప్పాడులోని బళ్లెం వారి వీధిలో ఉంటున్నాడు. పెయింటింగ్ పనులు చేస్తున్న ఇతను అప్పుల పాలై కళ్యాణికి బాకీ పడ్డాడు. అయితే తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వనందున కళ్యాణి పలుమార్లు అతనిపై ఒత్తిడి తీసుకువస్తూ అవమానంగా మాట్లాడటంతో భరించలేక అడ్డు తప్పించాలనుకున్నాడు. ఈక్రమంలో 9వ తేదీన ఒంటరిగా ఉన్న ఆమె ఇంటికి వెళ్లి కలిసి మద్యం సేవించి కత్తిపీటతో గొంతు కోసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు, బీరువాలోని నగదు తీసుకుని పరారయ్యాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి 33.400 గ్రాముల బంగారం, 15వేలు నగదు, హోండా యాక్టివా స్వాధీనం చేసుకున్నట్లు జాయింట్ సీపి చెప్పారు.
* నున్న హత్య కేసులో..
అదేవిధంగా నున్న పోలీస్టేషన్ పరిధిలో జరిగిన హత్య, దోపిడి కేసులో ఇద్దరు నిందితులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరినుంచి 28గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పాత పాయకాపురం కోదండ రామాలయం వీధిలో ఈ ఏడాది మే 19వ తేదీన ఆకుశెట్టి అన్నపూర్ణమ్మ అనే 70ఏళ్ళ వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు చేధించిన పోలీసులు నిందితులైన కొత్త రాజీవ్‌నగర్‌కు చెందిన కళ్ళేపల్లి ప్రకాష్ (24), ఇండ్ల సాయి ప్రశాంత్ (26)లను అరెస్టు చేసి 28గ్రాముల బంగారు నానుతాడు స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్తుడైన ప్రకాష్‌పై సస్పెక్ట్ షీటు ఉంది. ఆటో నడుపుతూ నేరాలకు పాల్పడే ప్రకాష్ 2011 నుంచి పలు కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లాడు. ఈక్రమంలో పాయకాపురం పెట్రోలు బంకు వద్ద వృద్ధురాలు అన్నపూర్ణమ్మను కిరాయికి ఆటో ఎక్కించుకుని ఇంట్లో దించి బియ్యం మూట లోపల పెట్టాడు. వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించి 19వ తేదీ రాత్రి ఇంట్లోకి ప్రవేశించి నిద్రపోతున్న వృద్ధరాలి ముఖంపై దిండుతో ఊపిరాకుండా చేసి గొంతు నులిమి హత్య చేశాడు. ఆతర్వాత బంగారు నానుతాడు, చెవి దిద్దులు, బీరువాలోని నగదు దోచుకుని పరారైనట్లు జాయింట్ సీపి తెలిపారు. విలేఖరుల సమావేశంలో డిసిపి కాంతి రానాటాటా, ఏసిపిలు సుందరరాజు, వర్మ, సిఐలు దామోదర్, సహేరా పాల్గొన్నారు.