విజయవాడ

ఉద్యోగాలు వచ్చేంతవరకూ జాబ్‌మేళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 17: అమరావతి రాజధాని గ్రామాల్లోని ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఉద్యోగాలు పొందేవరకూ జాబ్ మేళా కార్యక్రమాలు జరుగుతాయని, ఉద్యోగ సాధనకు తగిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కూడా యువతకు అందిస్తున్నట్టు సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నవులూరు గ్రామంలో నిర్వహించిన జాబ్ మేళాలో శ్రీ్ధర్ మాట్లాడుతూ అందివచ్చిన ప్రతి ఉద్యోగ అవకాశాన్ని ఆత్మవిశ్వాసంతో సాధించుకోవాలన్నారు. జాబ్ మేళా నిర్వహణతో అభ్యర్థుల సామార్ధ్యం పెంపొందుతుందని, ఇంటర్వ్యూలో విజయం సాధించని వారు నిరుత్సాహానికి గురికాకుండా ముందు ముందు వచ్చే మరిన్ని మెరుగైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఏయే అంశాల్లో వెనుకబడి ఉద్యోగాలు పొందలేకపోయారన్న విషయాన్ని గుర్తించి నిపుణులతో శిక్షణ ఇప్పించేందుకు సిఆర్‌డిఎ కృషి చేస్తుందని కమిషనర్ శ్రీ్ధర్ పేర్కొన్నారు. దేశ విదేశాల్లో తెలుగువారు అనేక మంది ఉన్నారని, మన ప్రాంతానికి దూరంగా ఉద్యోగం వచ్చినప్పటికీ ఇబ్బంది పడాల్సింది లేదన్నారు. ఉద్యోగం ఎక్కడ వచ్చినా వెళ్ళేందుకు మానసికంగా సిద్దపడాలని సూచించిన ఆయన గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువతకు కమ్యూనికేషన్స్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్‌లలో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణకు అభ్యర్థుల సామార్థ్యాన్ని జోడించి మంచి సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు సహకరిస్తుందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న జాబ్ మేళాలో పేరెన్నికగన్న అనేక సంస్థలు పాల్గొన్నాయని, సుమారు 678 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ముందుకు వచ్చిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్స్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ విభాగం డైరెక్టర్ బి ఎల్ చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పోలీసు సిబ్బందికి కొరత లేదు
* డిజిపి నండూరి సాంబశివరావు
విజయవాడ (క్రైం), అక్టోబర్ 17: రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత లేదని డిజిపి నండూరి సాంబశివరావు చెప్పారు. పోలీసులు ముఖ్యం కాదని, పోలీసింగ్ ముఖ్యమని, పోలీసు సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంగళగిరిలోని ఏపి ఎస్పీ బెటాలియన్‌లో మంగళవారం డిజిపి రక్తదాన శిబిరాన్ని ఫ్రారంభించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి ఏడాది పోలీసు సిబ్బందికి రూ.4.76 కోట్లతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, పోలీసు వెల్ఫేర్‌కు ప్రతి ఏటా ముఖ్యమంత్రి 15కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. పోలీసు సిబ్బందికి నివాయోగ్యమైన క్వార్టర్స్ లేవని, దీంతో బయటకు వెళ్లి ఉండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, క్వార్టర్స్ నిర్మాణానికి రెండు రకాల హౌసింగ్ స్కీముల అమలుకు కృషి చేస్తున్నామన్నారు. సర్వీసులో ఉన్న పోలీసులకు ఉచిత ఇళ్ళు ఏర్పాటు ఆలోచన ఉందన్నారు. సిబ్బంది స్వంతంగా ఉండేందుకు గేటెడ్ కమ్యూనిటీ తరహా ఇళ్ళు నిర్మిస్తామని, ఇప్పటికే ముఖ్యమంత్రి, హోం మంత్రి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌ల దృష్టికి ప్రతిపాదనలు పంపామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం పోలీసు సిబ్బందికి కార్యాలయాలు లేవని, కష్టపడి నిర్మించుకున్నామన్నారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత లేదని, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో 1.40లక్షల మంది పోలీసులు ఉండగా, విభజన సమయంలో ఏపికి 90వేల మంది పోలీసులు ఉంటే ఆ తర్వాత మరో 50వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. పాత రోజుల్లో 20-30 మంది పోలీసు సిబ్బంది చేసే పనిని కేవలం ఇప్పుడు ఇద్దరు ముగ్గురు సిబ్బంది చేస్తున్నారన్నారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ సమర్ధవంతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.