విజయవాడ

ఆలయాల్లో కార్తీక మాసం పూజలకు విస్తృత ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 17: జిల్లాలోని అన్ని శైవ పీఠాల్లో కార్తీక మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని, లేకుంటే శాఖాపరంగా వేటు తప్పదని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఉదయం ఆయనిక్కడ మాట్లాడుతూ ఈ నెల 20 నుండి కార్తీక మాసం ప్రారంభమై వచ్చే నెల 18న పరిసమాస్తం అవుతుందన్నారు. సృష్టి, స్థితి, లయకారకుడైన పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కార్తీక మాసమన్నారు. జిల్లాలో చిన్న, పెద్ద కలుపుకొని సుమారు 100 వరకు శైవ పీఠాలు ఉన్నాయన్నారు. కార్తీక మాసం ప్రారంభానికి ముందుగానే అన్ని శైవ పీఠాల్లో భక్తులకు అవసరమైన సదుపాయాల కల్పన, 29 రోజులు పాటు స్వామివార్లకు నిత్యం నిర్వహించే వివిధ రకాలైన మహాన్యాస ఏకదశ రుద్రాభిషేకాలు, లింగార్చన, వైదిక కార్యక్రమాలు, అర్చనలు, కార్తీక సోమవారాలకు సంబంధించి ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. ప్రత్యేకంగా శైవపీఠాలకు చెందిన ఇవోలు ప్రణాళికలు సిద్ధం చేసుకొని, అదనపు సిబ్బందిని సైతం ఏర్పాటు చేసుకొని ఘనంగా నిర్వహించాలన్నారు. దసరామహోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన స్పూర్తితోనే కార్తీక మాస మహోత్సవాలను సైతం నిర్వహించాలన్నారు. ప్రత్యేకంగా కృష్ణా నదీతీరం వెంబడి శైవ పీఠాలకు అధిక సంఖ్యలో భక్తులు వేకువజాము నుండే తరలి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని శైవ పీఠాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ముందురోజే ఆలయాలకు చేరుకోవాలన్నారు. ప్రతి ఆలయంలో ప్రత్యేక క్యూమార్గాలు, ఉచిత చెప్పుల స్డాండ్, ఉచిత ప్రసాదాల పంపిణీ, లగేజీ కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఇవోలను ఆదేశించినట్లు తెలిపారు. ఆదేశాలను పాటించని ఇవోలపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఎంతో నమ్మకంతో విలువైన ఆస్తులను దేవాదాయ ధర్మాదాయ శాఖకు దాతలు ఇచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకొని వాటిని పరిరక్షిస్తూ దాతల ఆశయాలకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు సత్యనారాయణ వివరించారు.

అండర్-14 స్కూల్ గేమ్స్ టిటి చాంప్ కృష్ణా
* బాలికల విజేత అనంతపురం * ముగిసిన టీం చాంపియన్‌షిప్ పోటీలు
విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 17: శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్టస్థ్రాయి స్కూల్‌గేమ్స్ అండర్ 14 టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ బాలుర విభాగంలో కృష్ణాజిల్లా జట్టు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోగా బాలికల విభాగంలో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో విశాఖపట్నం ద్వితీయ, అనంతపురం తృతీయ స్థానాలు సాధించాయి. బాలికల విభాగంలో విశాఖపట్నం ద్వితీయ, తూర్పు గోదావరి తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. మంగళవారం సాయంత్రం టీం చాంపియన్‌షిప్ విజేతలకు శాప్ ఒఎస్‌డి పి రామకృష్ణ, డిఎస్‌డిఓ బి శ్రీనివాసరావులు ముఖ్యఅతిథులుగా పాల్గొని పతకాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, పతకాలు సాధించిన వారికి వెంటనే నగదు పారితోషికాలు అందజేయడం జరుగుతుందన్నారు. విజేతలకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ఎస్‌జిఎఫ్ పరిశీలకులు శ్రావణ్‌కుమార్, శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ ప్రధానోపాధ్యాయుడు పి మురళి, జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్య నిర్వాహక కార్యదర్శి కె శకుంతలాదేవి, అంతర్జాతీయ క్రీడాకారిణి శైలూ నూర్‌బాషా, టెక్నికల్ కమిటీ చీఫ్ వై దామోదరరెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం వ్యక్తిగత విభాగంతో పాటు రాష్ట్ర జట్ల ఎంపికలు జరగనున్నాయి.