విజయవాడ

నడకుదురులో నరకాసుర వధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, అక్టోబర్ 18: చల్లపల్లి మండలంలో చారిత్రక ప్రదేశంగా భాసిల్లుతున్న ఒకప్పటి నరకోత్తారక క్షేత్రంగా పిలవబడిన నడకుదురులో నరకచతుర్దశిని పురస్కరించుకుని నరకాసుర వధ కార్యక్రమం బుధవారం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ స్కాంద పురాణంలో నరకోత్తారక క్షేత్రం ప్రస్థావన ఉందని, శ్రీకృష్ణుడు, సత్యభామలు ఈ ప్రదేశంలోనే నరకాసురుని వధించి సమీపంలోని కృష్ణానదిలో పిండ ప్రదానం చేసినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న నడకుదురు క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి ఆలయానికి విశిష్ట రీతిలో అభివృద్ధి చేసే క్రమంలో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో నిర్వహించిన కృష్ణా పుష్కరాలు సందర్భంగా ప్రత్యేక దృష్టి సారించి క్షేత్ర మహిమలను, చారిత్రక ప్రాశస్త్యాన్ని చాటిచెప్పటం జరిగిందన్నారు. 18 అడుగుల నరకాసుర విగ్రహాన్ని ఏర్పాటు చేసి వధించటం ద్వారా ఈ క్షేత్ర ప్రాముఖ్యతను మరింత చాటి చెప్పేందుకు దోహదపడుతుందన్నారు. ప్రతి యేటా నరకాసురవధ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బాణసంచాతో నింపిన 18 అడుగుల నరకాసుర విగ్రహాన్ని మండలి బుద్ధప్రసాద్ వెలిగించటం ద్వారా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యార్లగడ్డ సోమశేఖర ప్రసాద్, జెడ్పీటిసి కృష్ణకుమారి, సర్పంచ్ పుట్టి వీరస్వామి, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వృద్ధ్దాశ్రమంలో దీపావళి వేడుకలు
మచిలీపట్నం (కల్చరల్), అక్టోబర్ 18: స్థానిక జెట్టి నరసింహం ప్రభుత్వ వృద్ధులు, వికలాంగులు, ఆనాథ బాలుర వసతి గృహంలో బుధవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులకు దూరమైన వృద్ధులు ఆనందోత్సాహాల మధ్య దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. క్లబ్ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ, లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ పంచపర్వాల సత్యనారాయణరావు, కార్యదర్శి పుప్పాల ప్రసాద్, పైడిపాముల గురుప్రసాద్, సికినం కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.

వెలవెలబోతున్న టపాసుల దుకాణాలు
కూచిపూడి, అక్టోబర్ 18: దీపావళి పండుగ సందర్భంగా మొవ్వ మండలంలోని పెదపూడి వర్తక సంఘం కల్యాణ మండపంలో నాలుగు దుకాణాలు, మొవ్వ సంత బజారులో రెండు, నిడుమోలు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో రెండు, కోసూరు పిఎసిఎస్ ఆవరణలో రెండు టపాసుల దుకాణాలు ఏర్పాటుచేసి బుధవారం అమ్మకాలు కొనసాగించారు. టపాసుల ధరలు మోతమోగుతుండటంతో కొనుగోలుదారుల్లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. పండుగ రోజు పెట్టుబడులు తిరిగి వచ్చే అవకాశం ఉందని వర్తకులు పేర్కొంటున్నారు.
అవనిగడ్డలో...
అవనిగడ్డ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏ క్షణమైనా వర్షం కురిసే అవకాశం ఉండటంతో బాణసంచా విక్రయ దారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో దాదాపు 15 బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయగా కొనుగోలు చేసేవారులేక అవి దీనంగా కనపడుతున్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు పలు శాఖలకు ముడుపులు కూడా చెల్లించాల్సి ఉండటంతో ఏ విధంగా గట్టేకాలో అని ఆలోచనలో పడ్డారు. గురువారం వర్షం లేకపోతే బాణసంచా విక్రయాలు బాగుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

18 సంవత్సరాలు నిండినవారిని
ఓటర్లుగా నమోదు చేయాలి
అవనిగడ్డ, అక్టోబర్ 18: యువతను ఓటర్లుగా నమోదు చేయటంలో భాగంగా బూత్‌లెవల్ అధికారులు విధిగా ఆయా బూత్ లెవల్ పరిధిలోని కళాశాలలకు వెళ్లి 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయాలని స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, నియోజకవర్గ ఎఆర్‌ఓ కె శారద అన్నారు.
స్థానిక తాలూకా కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన తహశీల్దార్లు, బూత్‌లెవల్ అధికారులు, సూపర్‌వైజర్లు, రెవెన్యూ సిబ్బందికి ఆమె ఓటర్ల నమోదుపై అవగాహన కల్పించారు. ప్రతి నెలా 12, 19 తేదీలలో ఉదయం నుండి సాయంత్రం వరకు బిఎల్‌ఓలు ఆయా బూత్‌లలో కుర్చుని ఉండాలని, వచ్చిన దరఖాస్తులను విచారణ జరిపి నమోదు చేయాలని ఆమె సూచించారు. ఆ తరువాతనే ఓటర్ల చేర్పు లేదా తొలగింపులు జరగాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా మీ బూత్ పరిధిలో ఉన్న రాజకీయ నేతలు, ప్రతినిధులు ఓట్లు విధిగా ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా మీదేనన్నారు. తాను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన సందర్భంలో బిఎల్‌ఓలు అందుబాటులో లేకపోతే చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే డ్రాఫ్ట్ పబ్లికేషన్, ఫైనల్ పబ్లికేషన్‌లు ఏర్పాటు చేయడంలో అలసత్వం కూడదన్నారు. ఒక సంవత్సరం లేదా ఈలోపే ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

ఉపాధి కూలీలకు
రూ.337 కోట్లు విడుదల
తోట్లవల్లూరు, అక్టోబర్ 18: రాష్ట్రంలో కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధిహామి కూలీల బకాయిలు రూ.337 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఈనెల 17న విడుదల చేసిందని ఉపాధిహామి రాష్ట్ర డైరెక్టర్ వీరంకి వెంకట గురుమూర్తి చెప్పారు. తోట్లవల్లూరులో తన నివాసంలో బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతు వైసిపి ఎంపిలు ఉపాధిహామి పథకంలో అవినీతి జరుగుతోందని కేంద్రానికి ఫిర్యాదు చేయటం వల్ల కోట్లాది రూపాయల నిధులను నిలిపివేయటం వల్ల కూలీలు ఎంతో ఇబ్బందులకు గురయ్యాని అన్నారు. సిఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ కేంద్రంతో చర్చించిన తరువాత రూ.337 కోట్లు విడుదలయ్యాయని అన్నారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను అన్ని గ్రామాల్లో నిర్మించి రూ.1000 కోట్ల ఆదాయాన్ని పంచాయతీలకు తీసుకు వచ్చేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని గురుమూర్తి చెప్పారు.

టిడిపి జిల్లా మహిళా
ఉపాధ్యక్షురాలిగా పద్మ
కూచిపూడి, అక్టోబర్ 18: తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా గుత్తికొండ పద్మను పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు నియమించారు. మొవ్వ మండలం పెడసనగంటిపాలెంకు చెం దిన పద్మ టిడిప్టి ఆవిర్భావం నుండి నాయకులు ఎవరైనా కార్యకర్తగా పార్టీ కి సేవలందించింది. ఈమె సేవలను గుర్తించిన పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడు పద్మను మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు. పద్మను పార్టీ మండల అధ్యక్షుడు తాతా వీర దుర్గాప్రసాద్, మాజీ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట్రావ్, పులి కిరణ్ బాబు, బోలెం కృష్ణప్రసాద్ బుధవారం అభినందించారు.

అభినవ నరకాసురుడు జగన్
* మంత్రి కొల్లు ధ్వజం
విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 18: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్భ్రావృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుంటే అభినవ నరకాసురుడిలా జగన్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ప్రజలే ఓటుతో సంహరించడం తథ్యమని న్యాయ, నైపుణ్యాభివృద్ధి, యువజన, క్రీడలు, ఎన్‌ఆర్‌ఐ సాధికారిత శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి, రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం అన్నివిధాలా చేయూతనిస్తుంటే జగన్ అడ్డుకుంటున్నారన్నారు. బిసిల అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడిన చరిత్ర వైఎస్ కుటుంబానికి మచ్చలా మిగిలిపోయిందన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలోనే బిసిలకు న్యాయం జరుగుతోందన్నారు. సంక్రాంతి పండుగలోపే రాష్ట్రంలోని యువతకు వెయ్యి కోట్లతో నిరుద్యోగ భృతి అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో యువతకు 25 క్రీడా కిట్లు అందజేయనున్నట్లు చెప్పారు. విదేశాల్లో ఉన్న 25లక్షల మంది ప్రవాసాంధ్రులకు 24 గంటలు పనిచేసేలా ఒక కాల్‌సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి 21న దుబాయ్‌లో దీన్ని ప్రారంభించనున్నారన్నారు. ప్రవాసాంధ్రుల సమస్యలను తెలుసుకోడానికి ఈ నెల 20 నుంచి 24 వరకు గల్ఫ్ దేశాల్లో ఆయన పర్యటిస్తున్నారని మంత్రి రవీంద్ర వివరించారు.

పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమం
* అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలి
* టూరిజం అధికారులకు కలెక్టర్ సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 18: రాజధాని అమరావతి పరిధిలో ఇబ్రహీంపట్నం వద్ద సంగమమైన కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రదేశాన్ని దేశ, విదేశీల నుండి వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా తీర్చిదిద్దాలని టూరిజం శాఖాధికారులను జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం సూచించారు. బుధవారం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమాన్ని టూరిజం శాఖాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పవిత్ర సంగమం వద్ద టూరిజం శాఖ ఏర్పాటు చేస్తున్న వాటర్ స్పోర్ట్స్, స్పీడ్ బోట్స్, పాంటూన్ బోట్, బవాన బోట్, బటర్‌ఫ్లై బోట్‌లను కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలన్నారు. రాజధాని అమరావతి పరిధిలో సుదీర్ఘంగా కృష్ణానది ప్రాంతం ఉందని, రెండు జిల్లాల నడుమ పవిత్ర సంగమం ఇబ్రహీంపట్నం నుండి సుమారు 18 కిలోమీటర్ల పొడవున ప్రకాశం బ్యారేజీ వరకు గోదావరి, కృష్ణా జలాల కళకళలు ఎంతో ఉత్తేజాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తాయన్నారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా టూరిజం అధికారులు మంచి కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్మీకాంతం సూచించారు. పర్యటనలో టూరిజం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లికార్జున్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ హరీష్ పాల్గొన్నారు.

పర్యాటకులకు కార్తీక మాసం ప్యాకేజీలు
* టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిఎం గంగరాజు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 18: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేసినట్లు ఎపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ వివిఎస్ గంగరాజు అన్నారు. బుధవారం భవానీపురం వద్ద ఉన్న బరంపార్కులో ఎపి పర్యాటక కార్పొరేషన్ కార్తీక మాసంలో ప్రత్యేక ప్యాకేజీలపై ఆయన విలేఖరులతో మాట్లాడారు. కార్తీకమాసంలో పర్యాటకుల సౌకర్యా ర్థం 4 ప్రత్యేక ప్యాకేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్యాకేజీ 1లో ప్రతి వ్యక్తికి రూ. 250 చొప్పున, 10ఏళ్లలోపు వారికి రూ. 200 చొప్పున ధర నిర్ణయించి బరంపార్కు నుండి భవానీ ఐలాండ్‌కు తీసుకువెళ్లి రావడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. దీంట్లో సౌత్ ఇండియా లంచ్ ఇవ్వడంతోపా టు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్యాకేజీ 2లో ప్రతి వ్యక్తి రూ. 350 చొప్పున, 10ఏళ్లలోపు వారికి రూ. 300 చొప్పున ధర నిర్ణయించి బరంపార్కు నుండి భవానీ ఐలాండ్‌కు తీసుకువెళ్లి రావడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. దీంట్లో స్పెషల్ విజిటేరియన్ బఫెట్ ఇవ్వడంతోపాటు లంచ్ ఇవ్వడంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్యాకేజీ 3లో ప్రతి వ్యక్తికి రూ. 450 చొప్పున 10 సంవత్సరాల లోపు వారికి రూ. 400 చొప్పున ధర నిర్ణయించి బరంపార్కు నుండి భవానీ ఐలాండ్‌కు తీసుకువెళ్లి రావడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. దీంట్లో స్పెషల్ విజిటేరియన్ బఫెట్ ఇవ్వడంతోపాటు లంచ్ ఇవ్వడంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, స్నాక్స్, టీ అందించడం జరుగుతుందన్నారు. ప్యాకేజీ 4లో ప్రతివ్యిక్తి రూ. 500 చొప్పున 10 సంవత్సరాల లోపు వారికి రూ. 450 చొప్పున ధర నిర్ణయించడం జరిగిందని, హరితబరంపార్కులో బ్రేక్‌ఫాస్ట్, బరంపార్కు నుండి భవానీ ఐలాండ్‌కు తీసుకువెళ్లి రావడానికి నిర్ణయించడం జరిగిందన్నారు. దీంట్లో స్పెషల్ విజిటేరియన్ బఫెట్ ఇవ్వడంతోపాటు లంచ్ ఇవ్వడంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం స్నాక్స్, టీ అందించడం జరుగుతుందన్నారు. ఎపి టూరిజం కార్పొరేషన్‌తోపాటు గుర్తించిన ట్రావెల్ సంస్థల ద్వారా కూడా పర్యాటకులు ఈ సౌకర్యాన్ని పొందవచ్చనని డివిజనల్ మేనేజర్ అన్నారు. పర్యాటకులను ఆకర్షించడంతోపాటు వాలే ఎడ్వెంచర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్‌లో పాల్గొనవచ్చన్నారు. కార్తీకమాసం సందర్భంగా భవానీ ఐలాండ్‌కు వచ్చే పిల్లలతోపాటు మహిళలకు కూడా ఊయ్యాలలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పర్యటనలో అందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు గంగరాజు వివరించారు. సమావేశంలో బోటింగ్ మేనేజర్ మల్లేశ్వరరావు, భవానీ ఐలాండ్ మేనేజర్ సుధీర్, బరంపార్కు మేనేజర్ బాపట్ల సూర్యలంక, మేనేజర్ వామనమూర్తి, శివారెడ్డి, సూర్యనారాయణ పాల్గొన్నారు.

జిల్లాలో 50 వేల మందికి ఇళ్ల స్థలాలు
* పంపిణీకి చర్యలు తీసుకోండి
* ఆర్డీవోలకు కలెక్టర్ లక్ష్మీకాంతం సూచన
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 18: జిల్లాలో 50 వేల మందికి ఇండ్ల స్థలాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారులను జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో, పట్టణాల్లో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రెగ్యురైజేషన్ ఆఫ్ ఎంక్రోజ్‌మెంట్ కింద ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అన్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు నిర్దేశించిన భూ సేకరణలో భాగంగా 89 కేసులు కోర్టు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. కోర్టు కేసులు పరిష్కారం అయితే జిల్లా వెయ్యి ఎకరాల భూమి ప్రభుత్వ కార్యక్రమాలకు అందుబాటులోకి రాగలదని ఆయన అన్నారు. పేద వానికి ఎక్కడ అన్యాయం జరిగినా సహించేదిలేదని ఆ దిశగా అధికారులు ప్రభుత్వ ఫలాలా అర్హతగల ప్రతి లబ్ధిదారునికి అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌వో చెరుకూరి రంగయ్య, ఆర్‌డివోలు సాయిబాబ, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

స్కూల్ గేమ్స్ అండర్-14
టిటి వ్యక్తిగత చాంప్ అక్షత్
* బాలికల వ్యక్తిగత చాంప్ ఛార్వి * ముగిసిన రాష్ట్ర స్థాయి పోటీలు
విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 18: శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్ 14 స్కూల్‌గేమ్స్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ వ్యక్తిగత బాలుర విభాగంలో కృష్ణాజిల్లాకు చెందిన అక్షత్ చాంపియన్‌గా నిలువగా బాలికల విభాగంలో తూర్పుగోదావరికి చెందిన ఛార్వి విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో విశాఖపట్నంకు చెందిన దుత్తా అవినాష్ ద్వితీయ స్థానం, తూర్పు గోదావరికి చెందిన జూడమార్టిన్ తృతీయ స్థానం సాధించగా బాలికల విభాగంలో అనంతపురంకు చెందిన శ్రేష్ట, టి హసినిలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అనంతరం విజేతలకు రాష్ట్ర స్కూల్‌గేమ్స్ పరిశీలకులు శ్రావణ్‌కుమార్ పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్‌గేమ్స్ సమాఖ్య కార్య నిర్వాహక కార్యదర్శి కె శకుంతలాదేవి, శ్రీ విశ్వభారతి విద్యానికేతన్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పి మురళి, అంతర్జాతీయ క్రీడాకారిణి శైలూ నూర్‌భాషా, టెక్నికల్ కమిటీ చీఫ్ వై దామోదరరెడ్డి, వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు రమాదేవి, తన్యగిరి, కె సుగుణారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర జట్ల ఎంపికలు నిర్వహించారు. బాలుర విభాగంలో అక్షత్ (కృష్ణా), దుత్తా అవినాష్ (విశాఖపట్నం), జూడ్‌మార్టిన్ (తూర్పుగోదావరి), ధార్మిక్ (అనంతపురం), పి సూర్యతేజ (తూర్పుగోదావరి), బాలికల విభాగంలో ఛార్వి (తూర్పుగోదావరి), శ్రేష్టా, టి హసిని (అనంతపురం), బి హసిని (విశాఖపట్నం), హిమప్రియ (అనంతపురం) ఎంపికయ్యారు.