విజయవాడ

2న నవనిర్మాణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 30: రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో రెండో నవ నిర్మాణ దీక్షకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 2వ తేదీన బెంజిసర్కిల్ వద్ద జరిగే నవ నిర్మాణ దీక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా కల్పించే దిశగా సంకల్పించిన ఈనవ నిర్మాణ దీక్ష రెండో ఏడాది జరుపుకుంటోంది. కాగా.. ఈకార్యక్రమానికి భారీగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తరలిరానున్నారు. దీంతో రాష్ట్రంలోని నలుమూలల నుంచి నగరం మీదుగా రాకపోకలు సాగే ప్రధాన జాతీయ రహదారి కూడలి అయిన బెంజిసర్కిల్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నందున ట్రాఫిక్ సమస్య ఉత్పన్నంకాక తప్పదు. పైగా.. ఈ కార్యక్రమానికి సీఎం, ఇతర వివిఐపిలు హాజరుకానున్న దృష్ట్యా బందోబస్తు, భద్రత కూడా అత్యంత ప్రధానమైంది. ఈనేపధ్యంలో నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ నవ నిర్మాణ దీక్ష సందర్భంగా బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ ఏర్పాట్లు, అదేవిధంగా బందోబస్తు, భద్రతకు సంబంధించి ఆయన ఉన్నతాధికారులతో సోమవారం కమిషనరేట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాన జాతీయ రహదారి నాలుగు రోడ్ల కూడళి అయిన బెంజిసర్కిల్ వద్ద ఈ కార్యక్రమం సందర్భంగా భారీ వాహనాలతో పాటు ఇతర వాహనాలు, వాహన చోదకులకు ఎలాంటి అవాంతరాలు, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా మళ్లింపు చర్యలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా సీపి సమీక్షించారు. గత ఏడాది నిర్వహించిన తీరును పరిగణనలోకి తీసుకుంటూనే ప్రస్తుతమున్న పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన అంశాలు, ఇదే సమయంలో భద్రత, బందోబస్తుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అధికారులతో సీపి సమీక్షించి తగిన సూచనలు చేశారు.