విజయవాడ

దళితుల అభ్యున్నతే కేంద్రం లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, అక్టోబర్ 23: దళితుల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బిజెపికి మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సీనారామ్ కోరారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం సోమవారం ఉదయం పార్టీ కార్యాలయంలో జరిగింది. ముఖ్యఅతిథిగా వచ్చిన సీనారామ్ సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అభివృద్ధి, సంస్థాగతంగా బలోపేతం చేయడంపై సమావేశంలో చర్చించామన్నారు. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి కార్యకర్తలపై సిపిఎం హత్యాకాండను ఖండిస్తూ ఈ మారణకాండను ఆపాలని సమావేశం తీర్మానం చేసిందన్నారు. దళితులను ఇంతకాలం తమ ఓటు బ్యాంకుగానే పరిగణించిన కాంగ్రెస్ పార్టీ వారి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా మోసం చేసిందని దుయ్యబట్టారు. మోదీ పాలనలో దళితుల అభివృద్ధికి పలు ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముద్ర, స్టాండప్ ఇండియా, ఉపకార వేతనాలు, జన్‌ధన్, జీవన్‌జ్యోతి బీమా ఇలా పలు పథకాలు అమలుచేస్తూ వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నట్లు చెప్పారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ను ఏనాడు గౌరవించలేదన్నారు. జనసంఘ్ నాయకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్‌కు సన్నిహితంగా ఉండి పదవి లభించేందుకు కృషి చేశారన్నారు. దళితులకు ఎన్నో చేస్తున్న భాజపాను వారికి దగ్గర చేసేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్థులను విద్యను అందించి జ్ఞానవంతులను చేయడం అధ్యాపకుల లక్షణమని కాని కంచె ఐలయ్య కులం, మతాలను రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నాడని భాజపా ఎస్‌సి మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు బంగారు శృతి విమర్శించారు. కంచె ఐలయ్య వైశ్యులను విమర్శిస్తూ రాసిన పుస్తకాన్ని అన్ని రాష్ట్రాలు నిషేధించాలని కోరారు. పరిపూర్ణానందస్వామి తల్లిపై చేసిన వ్యాఖ్యాల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దళితులు ఐలయ్యను ఏనాడో బహిష్కరించారని చెప్పారు. విలేఖరుల సమావేశంలో ఎస్‌సి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, తెలంగాణా ప్రధాన కార్యదర్శి ప్రతాప్ పాల్గొన్నారు.