విజయవాడ

నగరంలో పార్కింగ్ జోన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 23: వాహనాల పార్కింగ్ కోసం పార్కింగ్ జోన్ల ఏర్పాటుకున్న సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయడంతో పాటు పారిశుద్ధ్య చర్యలకు విఘాతం కలిగించే పార్కింగ్ వాహనాలపై అపరాధ రుసుము విధించాలని విఎంసి కమిషనర్ జె నివాస్ అన్నారు. నగర పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం దాల్‌మిల్ ఏరియాలోని బిఆర్‌టిఎస్ రోడ్డు చివర రైల్వే సరిహద్దు వద్ద రోడ్డుపై అధిక మొత్తంలో చెత్తా చెదారం ఉండటాన్ని గమనించిన ఆయన అందుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకోగా కేవలం రోడ్లు శుభ్రపర్చే సమయంలో వాహనాల పార్కింగ్ అడ్డంగా ఉండటం వలన పూర్తిగా శుభ్రపర్చలేకపోతున్నామని వివరణ ఇచ్చిన అధికారులకు నివాస్ పలు సూచనలు చేశారు. పగలు, రాత్రి సమయాల్లో వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా పార్కింగ్ జోన్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే పాడైన, ధీర్ఘకాలం వినియోగించకుండా రోడ్ మార్జిన్ల వెంబడి పార్కింగ్ చేసే వాహనాలపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, నగరంలోని పలుచోట్ల పాడైన వాహనాలతోపాటు దీర్ఘకాలం పాటు పార్కింగ్ చేసిన వాహనాలు అనేకం ఉన్న విషయాన్ని గుర్తించి వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తదుపరి సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్‌ను సందర్శించిన ఆయన పలుచోట్ల టైల్స్ పాడైపోయిన విషయాన్ని గుర్తించి తక్షణమే వాటి మరమ్మతులు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్విమ్మింగ్ పూల్ ఏరియాలో ఆకర్షనీయమైన గ్రీనరీని ఏర్పాటుచేసి పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. ఇటీవల వినాయక చవితి పండుగ సమయంలో స్థానిక జింఖానా గ్రౌండ్ ప్రహరీ గోడ తొలగించిన నిర్వాహుకులతో మళ్లీ గోడ నిర్మాణానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సంగీత కళాశాల అవుట్‌ఫాల్ డ్రైయిన్, రోడ్డుకు మద్యనున్న స్థలంలో మొక్కలను నాటి గ్రీనరీని అభివృద్ధిపర్చాలన్నారు. విశాలాంధ్ర రోడ్డులోని బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్సు ఆవరణలో చెత్త చెదారం నిండి వుండటాన్ని గుర్తించిన కమిషనర్ తక్షణమే కాంప్లెక్సులో పారిశుద్ధ్యం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో డిఇఇ నారాయణమూర్తి, ఎఇ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.