విజయవాడ

కళాక్షేత్రం టారిఫ్ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 23: నగరంలోని ప్రతిష్టాత్మకమైన తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం రోజు వారి అద్దె టారీఫ్ ఖరారైంది. గడచిన గత కొంత కాలంగా ఈటారీఫ్ నిర్ణయంపై తర్జనభర్జన పడిన నగర పాలకులు ఎట్టకేలకు అందరికీ ఆమోదయోగ్యమై టారీఫ్‌ను నిర్ణయించారు. ఈమేరకు సోమవారం నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన కౌన్సిల్ భవనంలోని తన ఛాంబర్‌లో నిర్వహించిన తుమ్మలపల్లి కళాక్షేత్రం కమిటీ సభ్యులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. సుమారు 9 కోట్ల రూపాయల కేంద్రం నిధులతో ఆధునీకరించిన తుమ్మలపల్లి కళాక్షేత్రం రోజు వారి అద్దె ఇప్పటివరకూ రోజుకు లక్ష రూపాయలుగా నిర్ణయించగా, సర్వత్రా వ్యతిరేకత చాటుకొన్న నేపథ్యంలో అద్దె ఖరారుపై కౌన్సిల్‌లో జరిగిన చర్చ, తీర్మానం మేరకు మేయర్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. ఈమేరకు అద్దె నిర్ణయంలో వివిధ రూపాల్లో సమాలోచనలు చేసిన అనంతరం అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా నిర్వహణ నియమ నిబంధనల్లో కొన్ని సవరణలు చేస్తూ కమిటీ అద్దె ఖరారుపై తీర్మానం చేసింది. అలాగే ప్రస్తుతం జనరేటర్ సదుపాయం లేనందున కరెంట్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు గాను తక్షణమే జనరేటర్‌ను అందుబాటులోకి తేవాలని మేయర్ శ్రీ్ధర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నూతన టారీఫ్ ధరలను పరిశీలిస్తే సాంస్కృతిక కార్యక్రమాలకు (గ్రీన్ రూమ్స్‌తో పాటు) పూర్తి రోజు 20వేలు, 12 గంటలు 10వేల రూపాయలుగా నిర్ణయించారు. ప్రభుత్వ సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు 24 గంటలకు 50వేలు, 12 గంటలకు 30 వేలు, వ్యాపారపరమై కార్యక్రమాలకు 24 గంటలకు 80వేలు, 12 గంటలకు 40 వేల రూపాయలుగా నిర్ణయించారు. అడ్సాన్ పేమెంట్‌గా 50వేలు, 25వేల రూపాయలుగాను, శానిటేషన్ చార్జీలు 12వేలు, 10వేలుగా ఖరారు చేశారు. అయితే గతంలో 10వేల రూపాయల చెల్లింపుతో తినుబండారాల స్టాల్ ఏర్పాటుకు అనుమతించిన పాలకవర్గం ప్రస్తుత సవరణలో స్టాల్ ఏర్పాటుకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం నిర్ధారించిన రేట్లపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిఎస్‌టి వసూలు చేస్తారు. అలాగే కార్యక్రమాల వారీగా కరెంట్ చార్జీల వసూలు ఉంటుంది. ఈ సమావేశంలో నగర డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు, కార్పొరేటర్లు కాకు మల్లికార్జునయాదవ్, ముప్పా వెంకటేశ్వరరావు, చెన్నుపాటి గాంధీ, ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, విఎంసి ఎస్టేట్ ఆఫీసర్ కృష్ణమూర్తి, ఇన్‌చార్జ్ సిఇ పి ఆదిశేషు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ అశోక్‌వౌర్య, తదితరులు పాల్గొన్నారు.

ఆల్ ఇండియా వర్శిటీ స్విమ్మింగ్
చాంపియన్‌షిప్‌కు జట్టు ఎంపిక
విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 23: పంజాబ్‌లోని చండీగఢ్ యూనివర్శిటీలో ఈ నెల 26 నుంచి 30వరకు జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌కు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ జట్టును యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ ఇ త్రిమూర్తి ప్రకటించారు. పురుషుల విభాగం నుంచి షేక్ సమీర్ (డాక్టర్ గురురాజ్ ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాల- గుడివాడ), మహిళల విభాగం నుంచి వి సాయిశ్రీ (గాయత్రి విద్యాపరిషత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ అండ్ మెడికల్ టెక్నాలజీ- విశాఖపట్నం), అఫ్షన్ నహీద్ (నిమ్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్- ఇబ్రహీంపట్నం) ఎంపికయ్యారు. జట్టుకు మేనేజర్‌గా ఎ వేణు వ్యవహరిస్తారని వివరించారు.
25న ఎయిర్‌పిస్టల్ అండ్ షూటింగ్‌కు జట్ల ఎంపిక
డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ ఎయిర్ పిస్టల్ అండ్ షూటింగ్ పురుషుల, మహిళల జట్లను ఈ నెల 25న ఎంపిక చేయనున్నట్లు యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ ఇ త్రిమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికను సిద్ధార్థ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్టీఆర్ యూనివర్శిటీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులు ఈ ఎంపికలో పాల్గొనవచ్చన్నారు. ఈ ఎంపిక ట్రయల్స్‌లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను నవంబర్ 10 నుంచి 15వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తికలిగిన విద్యార్థులు 25న ఉదయం 10గంటలకు తమ ధ్రువీకరణ పత్రాలతో ఎంపికకు హాజరవ్వాలని ఆయన సూచించారు.