విజయవాడ

శంభో శంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 23: శంభో శంకర అంటూ భక్తులు చేసిన శివ నామస్మరణతో నగరవ్యాప్తంగా అన్ని శివాలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. కార్తీకమాసంలో వచ్చిన తొలి సోమవారం కావటంతో భక్తులు అధిక సంఖ్యలో శివాలయాలకు తరలి వచ్చారు. దీనికితోడు కార్తీక సోమవారం, నాగుల చవితి 2 పర్వదినాలు ఒకే రోజు కలిసి రావటంతో భక్తుల రద్ధీ మరింత పెరిగింది. ఈకార్తీక మాసం ఈనెల 20న ప్రారంభమైంది. తొలుత భక్తులు పవిత్ర కృష్ణనదిలో నిష్ఠతో స్నానాలు ఆచరించి వారికి సమీప ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలకు వచ్చి శివయ్యకు మహాన్యాస ఏకదశరుద్రాభిషేకాలు, అర్చనలు, విభూది అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు శ్రద్ధతో నిర్వహించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న పరమేశ్వరుని సన్నిధితోపాటు, నగరంలోని ప్రాచీనమైన, ప్రసిద్ధి చెందిన అన్ని శైవపీఠాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పెద్ద ఆలయం మొదలుకొని చిన్న శివాలయాల్లో సైతం భక్తుల రద్ధీ అధికంగా కనబడింది. ఇంద్రకీలాద్రిపై నటరాజ మందిరంలో సమీపంలో ఏర్పాటు చేసిన పరమేశ్వరుని దర్శించుకోవటానికి భక్తులు వేకువజాము నుండే బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పరమేశ్వరునికి దర్శించుకోవటానికి సోమవారం భక్తులు బారులు తీరారు. ధర్మరాజుచేత ప్రతిష్ఠింపబడిన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానం (పాతశివాలయం)లో ఇవో కెవియన్‌డికె ప్రసాద్ ఆదేశాలతో ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు నాగరాజుశర్మ, రాఘవేంద్ర శర్మ సోమవారం వేకువజామున 3గంటలకు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. కెనాల్ రోడ్ వైపునకు ప్రత్యేక క్యూమార్గాలను ఏర్పాటు చేశారు. పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు ఈమార్గాల ద్వారా అంతరాలయంలోకి చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు భక్తితో నిర్వహించుకున్నారు. ఇక్కడ స్వామి దర్శనానికి సుమారు 4గంటల సమయం పట్టింది. ఉదయం 6గంటల నుండే దేవస్థానం సిబ్బంది 2 రకాలైన ప్రత్యేక ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయటంతోపాటు, మధ్యాహ్నం 12గంటలకు స్వామికి నివేదించిన అన్నదాన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఇవో ఆదేశాలతో సిబ్బంది ప్రత్యేక క్యూమార్గాలను ఏర్పాటు చేయటంతో వచ్చిన భక్తులు వారికి అనుకూలమైన క్యూమార్గాల ద్వారా అంతరాలయంలోకి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. సోమవారం వేకువ జామున 3గంటలకే భక్తులు అధిక సంఖ్యలో దుర్గా ఘాట్‌కు చేరుకొని పవిత్ర స్నానాలు ఆచరించారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను దృష్టిలో పెట్టుకొని పోలీసులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులను దర్గా వద్ద బారికేడ్స్‌ను ఏర్పాటు చేసి కేవలం స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులను మాత్రమే ఘాట్ వరకు అనుమతించారు. పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు శివాలయాలకు వెళ్లి శ్రద్ధతో పరమేశ్వరునికి పూజలను నిర్వహించుకున్నారు. ఎసి సత్యనారాయణ, తనిఖీ అధికారి ఎ సుజన్‌కుమార్, కార్యాలయం పర్యవేక్షుడు శెట్టి, మాజీ ధర్మకర్తలు అడ్డూరి లక్ష్మణరావు, పొట్నూరి దుర్గా ప్రసాద్ స్వామిని దర్శించుకున్నారు. ప్రకాశం బ్యారేజీ కూడలి ఎదుట ఉన్న శ్రీ విజయేశ్వరస్వామివారి దేవస్థానంలో కొలువైన స్వామి దర్శనానికి భక్తులకు సుమారు 2గంటల సమయం పట్టింది. ఆలయ పర్యవేక్షకుడు శేషు ఆదేశాలతో సిబ్బంది ఆదివారం సాయంత్రమే ఏర్పాట్లు చేయటంతో వేకువ జామున 3గంటలకు ప్రధాన అర్చకుడు విజయానందశర్మ స్వామికి పూజలను నిర్వహించారు. దుర్గగుడి దత్తత ఆలయమైన శ్రీ గంగా పార్వతీ సమేత వసంత మల్లిఖార్జున స్వామివార్ల దేవస్ధానం (బుద్దావారిగుడి)లో ప్రధాన అర్చకుడు చంద్రశేఖర్‌శర్మ స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఇక్కడ స్వామి దర్శనానికి సుమారు గంట సమయం పట్టింది. గవర్నపేట చల్లపల్లి బంగ్లా సెంటర్‌లో ఉన్న శ్రీ కాశీవిశే్వశ్వర అన్నపూర్ణ దేవస్థానంలో కొలువైన గరళకంఠుని దర్శించి అభిషేకాలు నిర్వహించుకోవటానికి భక్తులు సుమారు 3గంటల సమయం పట్టింది. ఇవో వై సీతారామయ్య ఆదేశాలతో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. నగరానికి చెందిన పలువురు విఐపిలు స్వామిని దర్శించుకున్నారు. ఇక్కడ భక్తులకు 2రకాలైన ప్రసాదాలను పంపిణీ చేశారు. యనమలకుదురు శ్రీ దుర్గాదేవి స్థానం ప్రాంగణంలోని శివాలయం, చోడవరం, పెదపులిపాక, తదితర శివాలయాలకు భక్తులు అధికంగా వచ్చారు. ఈ 3 దేవస్థానాల ఇవో యల్ సత్యవతి ఆదేశాలతో సిబ్బంది ముందుగానే ప్రత్యేక క్యూమార్గాలను ఏర్పాటు చేయటంతో భక్తులు పరమేశ్వరుని దర్శించుకొని పూజలను నిర్వహించుకున్నారు. మాచవరం హిందీ కాలేజీ రోడ్ అష్టాదశ శక్తి పీఠాలు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ వికెవి శర్మ, వి గీత దంపతులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మందిరానికి భక్తులు అధికంగా వచ్చారు. వీరు శ్రద్ధతో పరమేశ్వరునికి మహాన్యాస పూర్వక సహస్త్ర లింగార్చన, రుద్రహోమం, చండీ హోమం వంటి వైదిక కార్యక్రమాలను భక్తితో నిర్వహించుకున్నారు. ఈసందర్భంగా కమిటీ సభ్యులు 2రకాలైన ప్రత్యేక ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. బీసెంట్‌రోడ్‌లోని కౌతావారి శివాలయానికి భక్తులు అధికంగా వచ్చారు. పాతబస్తీ రాయల్ హోటల్ సెంటర్‌లోని శ్రీ దర్భేశ్వర స్వామివారి శివాలయం, భవానీపురం శివాలయం, కృష్ణ లంక శివాలయం, యనమలకుదురు కొండపైనున్న శివాలయం, సత్యనారాయణపురం శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.