విజయవాడ

పనుల్ని నిరంతరం పర్యవేక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 30: నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో ఎటువంటి నాణ్యతా లోపం లేకుండా నిరంతర పర్యవేక్షణ జరపాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ విఎంసి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. నగర పర్యటనలో భాగంగా 29వ డివిజన్ లోని ఊర్మిళా సుబ్బారావునగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. మెయిన్ రోడ్డు డ్రైయిన్ నిర్మాణం అనంతరం డ్రైయిన్‌కు రోడ్డుకు మధ్యగల మార్జిన్ స్థలాల్లో మట్టిని నింపకుండా గోతుల మయంగా ఉండటాన్ని గుర్తించిన ఆయన తక్షణమే మట్టిని నింపాలన్నారు. అలాగే నిర్మాణంలో దెబ్బతిన్న మంచినీటి పైప్‌లైన్ లకు తక్షణమే మరమ్మతులు చేపట్టి సక్రమ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని మూడు సర్కిల్స్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కృష్ణా పుష్కర అభివృద్ధి పనులపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరిపి నాణ్యతాలోపాలు లేకుండా సరి చూడాలన్నారు. ఈపర్యటనలో స్థానిక కార్పొరేటర్ బత్తిపాటి సంధ్యారాణి ఇఇ ఓంప్రకాష్, టి రంగారావు పాల్గొన్నారు.