విజయవాడ

లిట్టర్ ఫ్రీ జోన్ల ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 5: నగరంలో అమలుచేస్తున్న లిట్టర్ ఫ్రీ జోన్ల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ద్య పనులను మెరుగుపర్చాలని, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈసందర్భంగా గురువారం తన క్యాంపు కార్యాలయంలో విఎంసి ప్రజారోగ్యశాఖాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయమ మాట్లాడుతూ లిట్టర్ ఫ్రీ ప్రాంతాలుగా గుర్తించిన ఏలూరురోడ్డు, బందర్ రోడ్డు, రామవరప్పాడు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకూ రహదారుల పారిశుద్ద్య పనులలో ఎటువంటి లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. హెల్త్ ఆఫీసర్, శానిటరీ సూపర్‌వైజర్, ఇన్‌స్పెక్టర్ లు టీమ్‌గా ఏర్పడి క్షేత్ర స్థాయిలో ఆయా పనులను పర్యవేక్షించాలన్నారు. ఎంపిక చేయబడిన ప్రదేశాల్లోని షాపుల వారు రోడ్లపై తమ చెత్తను వేయకుండా సరిచూడాలన్నారు. అలాగే తోపుడు బండ్లు, ఇతర చిరువ్యాపారులు కూడా తమ చెత్తను చైతన్యపర్చాలన్నారు. పారిశుద్ద్య నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హితవుపలికారు. మొత్తం 12 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, పలువురు సిబ్బందితో ఎప్పటికప్పుడు పిన్ పాయింట్ ప్రకారం పారిశుద్ద్య పనులను నిర్వహిస్తున్నామని, ఆయా పనులను మరింత మెరుగుపర్చేందుకు విస్తృత చర్యలు తీసుకొంటామని కమిషనర్ వీరపాండియన్ అధికారులు వివరించారు. ఈ సమావేశంలో సిఎంహెచ్‌ఓ గోపి నాయక్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.