విజయవాడ

ఎన్జీటీ తీర్పు వైకాపాకు చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 18: గత మూడేళ్లుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, సానుభూతిపరులు రాజధాని, పోలవరం నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలకు పిటిషన్లతో ట్రిబ్యునల్, కోర్టుల దగ్గర మోకాలడ్డే ప్రయత్నం చేయడం నిత్యకృత్యమైందని టీడీపీ నేత లంకా దినకర్ విమర్శించారు. రాష్ట్ర రాజధాని నగరం, పోలవరం నిర్మాణం ప్రజల ఆకాంక్ష అనీ, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వకుండా నిస్సిగ్గుగా వాటిని అడ్డుకుంటూనే ఉన్నప్పటికీ జాతీయ హరిత ట్రిబ్యునల్‌అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులివ్వడం వైఎస్సార్‌సీపీ నాయకులకు చెంపపెట్టు లాంటిదని నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయనన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో పర్యావరణ అంశాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు సవివరమైన ప్రణాళికను ఇవ్వడంతో ట్రిబ్యునల్ సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. గతంలో శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని ప్రతిపాదించిందన్న వ్యాఖ్యలను కూడా తోసిపుచ్చుతూ, రాజధాని భూములు బలవంతంగా రైతుల దగ్గర నుండి లాక్కున్నారన్న వాదనలో పసలేని, వైఎస్సార్‌సీపీ నాయకుల నస మాత్రమేనని ట్రిబ్యునల్ తీర్పుతో స్పష్టమైందన్నారు. పోలవరానికి సంబంధించి కూడా జాతీయ హరిత ట్రిబ్యునల్ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు వేసిన పిటిషన్లను ఇప్పటికే తోసిపుచ్చిందని గుర్తుచేశారు. ఏపీలో ఏ అంటే అమరావతిని విశ్వవిఖ్యాత రాజధానిగా తీర్చిదిద్దడం, పీ అంటే పోలవరం పూర్తితో రాష్ట్రం మొత్తం తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడమని ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా లేఖలు, పిటిషన్లతో ప్రజోపయోగమైన ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయటంకన్నా, వారుకూడా ప్రాజెక్టులను వీక్షించి నిర్ణయాత్మక సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా నిర్ణీత సమయంలో ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని దినకర్ కోరారు.

ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించండి
* సీఎం చంద్రబాబుకు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
విజయవాడ, నవంబర్ 18: గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఆటో కార్మికులు సంవత్సరానికి రాష్టవ్య్రాప్తంగా రూ. 3వేల కోట్ల పన్నుల రూపేణా, మరో రూ. 500 కోట్లు వరకు పలురకాల జరిమానాల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నిరీక్షించకుండా అప్పులు చేసి సొంతంగా ఆటోలు కొనుగోలు చేసి కుటుంబాలను పోషించుకుంటున్న వీరి పట్ల ప్రభుత్వం చిన్నచూపుతో వ్యవహరిస్తోందని శనివారం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు వేలాది రూపాయల చలానాలను పెంచి ఆటోడ్రైవర్ల ఆదాయానికి గండికొడుతున్నాయన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా పెంచడంతోపాటు ఆటో థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్‌ను రూ. 360 నుండి రూ. 6,800కు పెంచాయన్నారు. ఆటోడ్రైవర్లను ఆదుకునేందుకు పెంచిన డ్రైవింగ్ లైసెన్స్, ఎఫ్‌సీల చలానా, పెనాల్టీలను ఉపసంహరించాలని, ఆటోల థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్‌ను 50 శాతంకు తగ్గించాలని, నూతన రోడ్లు, రవాణా బిల్లును ఉపసంహరించాలని, ఆటో కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐ, పెన్షన్‌తో కూడిన సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలని, ఆటోలపై పెట్టిన కేసులకు ఈ-చలానాలు రద్దు చేయాలని, ఆటోలపై పోలీసు, రవాణా అధికారులు అక్రమ కేసులు బనాయించడాన్ని విరమించుకోవాలని లేఖలో ఆయన కోరారు.