విజయవాడ

అన్ని సంఘాలు సంఘటితమై బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), నవంబర్ 18: దళితులు, బడుగు, బలహీన వర్గాల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్న బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలకు అన్ని సంఘాలు ఐక్యమై రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని నవ్యాంధ్ర పార్టీ నిర్మాత కత్తి పద్మారావు పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర పార్టీ ఆధ్వర్యంలో లౌకికవాద పార్టీల ఐక్యవేదిక సభ రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాలులో శనివారం జరిగింది. సభాధ్యక్షులుగా కత్తి పద్మారావు మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతూ ఎన్నికల అనంతరం వారి నోట ప్రభుత్వాలు మట్టి కొడుతున్నాయని విమర్శించారు. దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి అందరినీ సమానత్వంగా చూడవలసిందిపోయి దళిత, అగ్రవర్ణాలుగా విభజించి చూస్తున్నారన్నారు. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ దళిత, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేయకపోగా కనీసం నిలవడానికి నీడ కూడా లేకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హిందూ మతోన్మాద భావాలతో రెచ్చగొట్టి చివరకు హత్యల వరకు తీసుకెళుతున్నారన్నారు. రాజ్యాంగపరమైన భావజాలాలకు భిన్నంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఆరోపించారు. నీరు-చెట్టు పేరుతో ఎంతోమంది దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన భూములు లాక్కుని వారికి విదిలింపు చర్యలు చేపడుతుండటం దురదృష్టకరమన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేలా ఐక్యం కావటం అభినందనీయమన్నారు. పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దళితుల కోసం కత్తి పద్మారావు వేసిన ముందడుగు చాలా గొప్పదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులను అణగదొక్కే ధోరణిలో ఉన్నారుతప్ప వారి అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయటం లేదని విమర్శించారు. నీరు-చెట్టు పేరుతో దళితుల భూములను స్వాధీనం చేసుకోగా, మరోపక్క ఇదే దళితుల నుంచి మరికొన్ని జిల్లాల్లో చెరువుల నిర్మాణం పేరుతో దోచుకు తింటున్నారన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రాంతంలో దళితులంతా కలిసి చందా రూపంలో వసూలు చేసిన సొమ్ముతో అక్కడి పంచాయతీ అనుమతితో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం చేస్తే రాత్రికిరాత్రి అగ్రవర్ణాల వారు విగ్రహాన్ని తొలగించి చెరువులో పారేయడం దారుణమైన విషయమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 26 వేల 500 పంచాయతీలుంటే అందులో 6 వేలకు పైగా పంచాయతీల్లో నిర్వహిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థను రిలయన్స్ మాల్స్‌కు కట్టబెట్టటం సరికాదని, చంద్రబాబుకు దళితుల పట్ల ఎంత ప్రేమ వుందో దీనిద్వారా అర్థమవుతోందన్నారు. ఇలాంటి సమయంలో నవ్యాంధ్ర పార్టీ ఎంతో అవసరమని అన్నారు. పద్మారావు రచించిన దళితుల చరిత్ర పుస్తకాన్ని ప్రజాశక్తి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎస్ వెంకట్రావు ఆవిష్కరించారు. చింతలపల్లి గురుప్రసాద్, ఎస్‌కె మస్తాన్‌వలీ, పిల్లి విద్యాసాగర్, పాలేటి మహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కోటి దీపోత్సవం
ఇబ్రహీంపట్నం, నవంబర్ 18: కార్తీక మాసం ముగింపు సందర్భంగా శ్రీ గిరి వీరేశ్వర విశే్వశ్వరస్వామి ఆలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఉత్సాహంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు చైర్మన్ ఎంవి రామలింగేశ్వరరావు తెలిపారు. కొండపల్లి గ్రామంలోని ఈ ఆలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు జరిపించిన అనంతరం కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో భజనలు చేసి స్వామివారి దీవెనలకు పాత్రులయ్యారు. ఆలయ అర్చకులు సుబ్రమణ్యం భక్తులనుద్దేశించి మాట్లాడుతూ సుఖశాంతులతో అన్ని కుటుంబాలతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఆలయంలో కార్తీక మాసం పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఫౌండర్ చైర్మన్ ఎంవీ రామలింగేశ్వరరావు వివరించారు.