విజయవాడ

పుస్తకాలతోనే మెరుగైన సమాజం సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, నవంబర్ 19: విజ్ఞానవంతమైన, మెరుగైన సమాజ స్థాపనకు పుస్తకాలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో సర్వోత్తమ భవనంలో 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన సభలో కలెక్టర్, నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో, మన రాష్ట్రంలో గ్రంథాలయ ఉద్యమానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, స్వాతంత్రోద్యమ సమపార్జనకు కూడా ఆనాటి గ్రంథాలయ ఉద్యమాలు ఎంతో దోహదపడ్డాయని కలెక్టర్ అన్నారు. పుస్తకాలు చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. చెన్నుపాటి విద్యకు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు అవార్డును, నిరంతర పుస్తక ప్రచారకుడు ఆదర్శ గ్రంథాలయ కార్యకర్త షేక్ సాదిక్ ఆలీకి పాటూరి నాగ భూషణం గ్రంథాలయ పురస్కారం అందించడం ఎంతో శుభ పరిణామమని జిల్లా కలెక్టర్ అన్నారు. నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధికి, సమాజ అభివృద్దికి ఆనాటి నుండి నేటి వరకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. నిరంతరం కృషి చేస్తున్న ప్రముఖ సంఘ సేవకురాలు చెన్నుపాటి విద్య, ఆదర్శ గ్రామ గ్రంథాలయ సంస్థ షేక్ సాదిక్ ఆలీలను ఈ సందర్భంగా సన్మానించి పురస్కారాలు అందించారు. రాష్ట్ర గ్రంథాలయ అసోసియేషన్ అధ్యక్షులు కె చంద్రశేఖర్, కార్యదర్శి డా రావి శారదా, సర్వోదయ గ్రంథాలయ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గ్రాండ్‌మాస్టర్ లలిత్‌కు మంత్రి ఉమా అభినందనలు
విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 19: పాట్నాలో అక్టోబర్ 26 నుండి నవంబర్ 10వతేదీ వరకు జరిగిన 55వ జాతీయ ప్రీమియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఛాంపియన్‌గా నిలిచిన గ్రాండ్‌మాస్టర్ ఎంఆర్ లలిత్‌బాబును ఆదివారం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుప్రత్యేకంగా అభినందించారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇప్పటి వరకు ఈ ప్రీమియర్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ నుండి చాంపియన్‌గా నిలిచిన క్రీడాకారుడు లలిత్ కావడం విశేషం.

పోటాపోటీగా జాతీయస్థాయి అథ్లెటిక్స్

నాగార్జున యూనివర్సిటీ, నవంబర్ 19: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్రీడాప్రాంగణంలో గత నాలుగురోజులుగా జరుగుతున్న 33వ జాతీయస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు నువ్వా... నేనా... అన్నట్టు సాగుతున్నాయి. నాలుగవ రోజైన ఆదివారం జరిగిన పోటీలలో రెండు జాతీయ రికార్డులు నమోదయ్యాయి. అండర్ 18 బాలికల విభాగంలో డిస్కస్‌త్రో అంశంలో హిమాచల్‌ప్రదేశ్ సీమా నిర్దేశించిన గమ్యాన్ని 9నిమిషాల 50సెకన్లలో పూర్తి చేసి గతంలో తాను నెలకొల్పిన 9నిమిషాల 56సెకన్ల రికార్డును తిరగరాసింది. అండర్ 18 బాలుర విభాగంలో పోల్‌వాల్ట్ అంశంలో హార్యానాకు చెందిన ప్రశాంత్‌సింగ్ కాన్హియా 4.75 మీటర్లతో న్యూమీట్ రికార్డును నెలకొల్పారు. అండర్ 18 బాలికల విభాగంలో డిస్కస్‌త్రో అంశంలో హార్యానాకు చెందిన ఆషారాణి ప్రధమస్థానం సాధించగా, పంజాబ్‌కు చెందిన సునీతదేవి ద్వితీయ, తమిళనాడుకు చెందిన ఎం కారుణియా తృతీయ స్థానాలు సాధించారు. అండర్ 16 బాలుర విభాగంలో షాట్‌పుట్ అంశంలో ఉత్తరాఖండ్‌కు చెందిన అడిష్ గిల్డియాల్ ప్రధమ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రుద్ర నారాయణ పాండే ద్వితీయ, పంజాబ్‌కు చెందిన దన్వీర్‌సింగ్‌లు తృతీయ స్థానాలు సాధించారు. అండర్ 16 విభాగంలో డిస్కస్‌త్రో అంశంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వైభవ్‌చౌదరి ప్రధమ, పంజాబ్‌కు చెందిన మనీష్‌జోగి ద్వితీయ, హార్యానాకు చెందిన నికేత్ తృతీయస్థానాలు సాధించారు. అండర్ 18 బాలికల విభాగంలో హార్డిల్స్ అంశంలో కేరళకు చెందిన విష్ణుప్రియ, కె ఎం నిబ్కా వరుసగా ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించగా, మహారాష్టక్రు చెందిన వైష్ణవియాదవ్ తృతీయ స్థానాలు సాధించారు. అండర్ 20 విభాగంలో 400 మీటర్ల హార్డిల్స్ అంశంలో కేరళకు చెందిన పి ఒ సాయానా, అభిగైల్ ఆరోకియానాథన్‌లు వరుసగా ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించగా, తమిళనాడుకు చెందిన బిబిషా తృతీయ స్థానాలు సాధించారు.
అండర్ 20 బాలికల విభాగంలో హార్యానాకు చెందిన రేఖ ప్రధమ, ఆస్సాంకు చెందిన నార్జారీ ద్వితీయ, కర్ణాటక అభినయ్‌శెట్టి తృతీయస్థానాలు సాధించారు.