విజయవాడ

నడకతో ఆరోగ్యం పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 19: ప్రతి రోజు వేకువజామున నడక, పరుగు వంటి వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ అన్నారు. ఆదివారం బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మైదానం నుండి విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో జరిగిన పరుగు పోటీలను సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరుకులు, పరుగులతో కూడిన ఒత్తిడితో గడుపుతున్న ప్రజలకు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేందుకు కీలకపాత్ర పోషించే పరుగు ఒత్తిడిని దూరం చేస్తుందనడంలో సందేహం లేదన్నారు. ముంబాయి, ఢిల్లీ వంటి ట్విన్ సిటీలకు దీటుగా నగరంలో మారథాన్ రన్‌లో యువత పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు అమరావతికి టర్నింగ్ పాయింట్ అన్నారు.
తెల్లవారుజామున వచ్చి పరుగు పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వృద్ధులు, యువత, మహిళలు, చిన్నారులు ఇలాంటి కార్యక్రమాలపై మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం హ్యాపీ సండే వంటి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తుందన్నారు. విజయవాడ రన్నర్స్ వ్యవస్థాపకులు పి మణిదీపక్ మాట్లాడుతూ తమ అసోసియేషన్ స్థాపించి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీరామ్ సిటీ సహకారంతో తొలిసారిగా పరుగును నిర్వహించినట్లు తెలిపారు. హాఫ్ మారథాన్ 21కె, 10కె, 5కె, 2కె పరుగును నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలందరినీ భాగస్వాములను చేయడానికి పరుగును నిర్వహించినట్లు, పాల్గొన్న వారంతా విజేతలనే అన్నారు. అందుకే విజయవాడ నగరం దాటకుండా హాఫ్ మారథాన్ నిర్వహించినట్లు తెలిపారు. పరుగులో పాల్గొన్న వారందరికీ ధృవపత్రాలు, మెడల్స్, అల్పాహారం అందించినట్లు తెలిపారు. విజయవాడ రన్నర్స్ కార్యదర్శి రావులపాటి రాము తదితరులు పోల్గొన్నారు.

ఉల్లాసంగా హ్యాపీ సండే

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 19: విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరుగుతున్న హ్యాపీ సండే కార్యక్రమం స్థానిక ఇందిరాగంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోనేరు శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ జె నివాస్, పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్‌లు పాల్గొని కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని అందించారు. విద్యార్థినీ విద్యార్థులు, క్రీడాకారులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ క్రీడలు ఆడారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మేయర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్‌లు సైకిల్ తొక్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.