విజయవాడ

‘చలో అసెంబ్లీ’ ర్యాలీకి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, నవంబర్ 19 : ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై సోమవారం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 10.30 గంటలకు అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ వద్ద నుండి ప్రదర్శన ప్రారంభమవుతుందని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నగర కన్వీనర్ దోనేపూడి శంకర్ నేడొక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు రాజకీయాలకతీతంగా ఈ చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనాలని, అన్ని విపక్ష, ప్రజా సంఘాల నేతలు, ప్రజాతంత్ర వాదులు వేలాదిగా తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అంకుశంతో కదిలించాలని ఆయన కోరారు.
వైసీపీ సంపూర్ణ మద్దతు
* వెలంపల్లి, మల్లాది వెల్లడి
ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు ప్రధాన డిమాండ్లుగా సోమవారం జరగనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణులు వెల్లడించారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో తమ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొని హోదా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చాటి చెబుతారని అన్నారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని వెంకయ్యనాయుడు పదేళ్లు అంటే కాదు.. కాదు పదిహేనేళ్లు కావాలని చంద్రబాబునాయుడు నరేంద్ర మోదీ సమక్షంలో ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. చంద్రబాబు కేంద్రం ముందు మోకరిల్లి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ప్రధాన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌యేనని చెప్పారు. 13 జిల్లాల్లో యువభేరిలతో యువతలోను, ప్రజల్లోను ప్రత్యేక హోదా ప్రయోజనాలను చాటి చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సభలు, దీక్షలు పెట్టడంతో యువభేరిలతో యువతలో చైతన్యం(మిగతా 6లో)
రగిల్చిందన్నారు. ఈ నేపధ్యంలో వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజలకు వివరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో తమ పార్టీ కార్యకర్తలు పూర్తి మద్దతు ఇస్తారని అన్నారు. విలేఖరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి పైలా సోమినాయుడు కూడా పాల్గొన్నారు.
విజయవంతం చేయండి
* పీసీసీ నేత రఘువీరారెడ్డి పిలుపు
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 19 : విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఈనెల 20వ తేదీన వామపక్షాలు, ప్రజా సంఘాలతో కలిసి చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి నేడొక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం విడిపోయి మూడేళ్లు దాటుతున్నా కేంద్రం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన నిధులు ఇవ్వాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.