విజయవాడ

పోలీసుల బ్రేక్ ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 19: ప్రతిపక్ష పార్టీలు నిర్వహించ తలపెట్టిన ‘్ఛలో అసెంబ్లీ’కి బ్రేక్ పడనుంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాన ప్రతిపక్ష వైసిపితోపాటు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల నేతలు భారీ ఎత్తున విజయవాడ నుంచి వెలగపూడిలోని అసెంబ్లీకి ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ప్రతిపక్ష పార్టీల కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీంతో సోమవారం జరిగే ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి బ్రేక్ పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల నేతలు మాత్రం ఆరు నూరైనా ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని చెబుతున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నుంచి బయలుదేరి నేరుగా ప్రదర్శనగా అసెంబ్లీకి చేరుకుని నిరసన వెలిబుచ్చాలనేది కార్యక్రమం ఉద్ధేశ్యం. అయితే ప్రజాస్వామ్యంలో రాజకీయపార్టీలు శాంతియుతంగా తమ నిరసనను తెలియచేసే స్వేచ్చ హక్కు ఉన్నప్పటికీ శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో జాయింట్ పోలీసు కమిషనర్ బివి రమణకుమార్ ఆదివారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీలతో బేటీ అయ్యారు. ఛల్ అసెంబ్లీ కార్యక్రమం తలపెట్టిన సందర్భంగా ముందస్తుగా పార్టీ నేతలతో సమావేశమై నిబంధనలు సూచించారు. ఛల్ అసెంబ్లీకి ముందస్తు అనుమతి తీసుకోనందున పర్మిషన్ లేదని, కాదని నిర్వహిస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే శాంతి యుతంగా తాము నిరసన చేపడతామని రాజకీయ పార్టీల నేతలు జాయింట్ సీపి దృష్టికి తీసుకువచ్చారు. అయినప్పటికీ.. ఒక్క అడుగుకూడా ముందుకు కదలనివ్వమని జెసీపి తేల్చి చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు సుమారు రెండువేల మంది వరకు సమీకరణ అయ్యే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇందుకు తగిన విధంగా బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నారు.
* లా అండ్ ఆర్డర్ తప్పకూడదు: సీపి
ఛల్ అసెంబ్లీ నేపధ్యంలో పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపితే అభ్యంతరం లేదని, ధర్నాచౌక్‌లో సామాన్యులకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్నారు. ప్రతి రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యంలోని చట్టాలను గౌరవించాలని, అసెంబ్లీ ముట్టడి అంటూ కొన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీని వల్ల నగరంలో శాంతి భధ్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అలా జరిగితే చర్యలు తప్పవని సీపి స్పష్టం చేశారు.

సీమలో మానసిక వైద్యాలయం
విజయవాడ, నవంబర్ 19: రాయలసీమలో త్వరలోనే ప్రభుత్వ మానసిక వైద్యుల ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన పోస్టు గ్రాడ్యుయేట్ మానసిక వైద్యుల కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొగ్రాంలో ముఖ్యఅతిథిగా పాల్గొని సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా కామినేని శ్రీనివాస్ ఈ మేరకు హామీ ఇచ్చారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఇంత వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో మెంటల్ ఆసుపత్రి లేదన్నారు. మానసిక జబ్బులతో బాధపడుతున్న పేద వర్గాలకు చెందిన రోగులు చాలా దూరం ప్రయాణం చేసి విశాఖపట్నంలోని ప్రభుత్వ మెంటల్ ఆసుపత్రికి వెళ్లడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని అన్నారు. ఒకప్పుడు దగ్గర ఉన్న హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆసుపత్రికు వెళ్ళేవారన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వారికి ఆ అవకాశం లేకుండాపోయిందన్నారు. అందుచేత రాయలసీమ ప్రాంతంలో త్వరితగతిన ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని వసతులతో కూడిన మెంటల్ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. అంతే కాకుండా మన రాష్ట్రంలో కేవలం 150 మంది మానసిక వైద్యులు మాత్రమే ఉన్నారని వారి సంఖ్య పెంచేందుకు అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సైకియాట్రిక్ కోర్సు ప్రారంభించేందుకు కూడా తగిన చర్యలు తీసుకుంటారని మంత్రి చెప్పారు. ఇండ్లాస్ విమ్‌హాన్స్ ఆసుపత్రి తరుపున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ విశాల్ ఇండ్ల అధ్యక్షత వహించారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ తేజ, కార్యదర్శి డాక్టర్ రమేష్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల నుండి పీజీ కోర్సు చేస్తున్న సుమారు 100 మంది డాక్టర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు నంబా నరేష్‌కుమార్, పీఎస్‌వీఎన్‌శర్మ అవినాష్ డిసోజ, శ్రీ లక్ష్మీ,కర్రి రామారెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మానసిక వైద్యుల సంఘం తరపున రాయలసీమలో ప్రభుత్వ మానసిక ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి మంత్రి కామినేనికి అధ్యక్షులు డాక్టర్ విశాల్ మెమొరాండం అందజేశారు.