విజయవాడ

24 నుంచి అమరావతి రంగస్థల ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అమరావతి థియేటర్ ఫెస్టివల్ (రంగస్థల ఉత్సవాలు) విజయవాడ నగరంలో ఈ నెల 24 నుండి 26 వరకు నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈవో హిమాన్షు శుక్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం, కళాదర్శిని, సిద్ధార్థ అకాడమీలో ఈ రంగస్థల పండుగ జరుగుతుందన్నారు. ఈనెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరావతి రంగస్థల ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయన్నారు. ఈ సందర్భంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకృష్ణరాయభారం నాటకం ప్రదర్శితమవుతుందన్నారు. రంగస్థల ప్రముఖులు కోటా శ్రీనివాసరావు, కోట శంకరరావు, ఎస్‌కె మిస్రో హాజరవుతారన్నారు. మూడురోజుల పాటు కళాక్షేత్రం, కళాదర్శిని, సిద్ధార్థ అకాడమీలలో ‘గుమాయి, ముకున్, మాస్క్ చరణ్‌దాస్ చోర్, కర్ణ్భారణం, బారిష్టర్ పార్వతీశం, సత్యం శివం సుందరం నాటకాలు ప్రదర్శితమవుతాయన్నారు. విజయవాడ నగరంలో మొదటిసారిగా ఈ రంగస్థల ఉత్సవాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. అందరు రంగస్థల ప్రముఖులను ఈ సందర్భంగా ఒకచోటికి చేర్చి కళాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సాంస్కృతిక, కళాపోషణకు ఈ రంగస్థల పండుగ తోడ్పాటునిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నాటక రంగ ప్రోత్సాహానికి రంగస్థల రంగాన్ని నమ్ముకున్న కళాకారులను ఉత్సాహపరిచేందుకు ఈ రంగస్థల ఉత్సవాలు ఉపకరిస్తాయని ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ సీఈఓ విజయభాస్కర్ తెలిపారు.

చిన్న చిత్రాలను ప్రోత్సహించండి
* ప్రేక్షకులకు నటుడు జగపతిబాబు పిలుపు
పాతబస్తీ, నవంబర్ 20: ప్రేక్షకులు చిన్న చిత్రాలను ప్రోత్సహించాలని ప్రముఖ సినీనటుడు జగపతిబాబు కోరారు. చిన్న చిత్రాలను ఆదరించాలని కోరుతూ ‘చారిటీ వాక్’ పేరుతో ఆయన వన్‌టౌన్‌లో పాదయాత్రను నిర్వహించారు. ఈసందర్భంగా కాళేశ్వరరావు మార్కెట్ నుంచి బయలుదేరి పలు ప్రాంతాల్లో పాదయాత్రగా ముందుకు సాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నచిత్రాలను ఆదరించాలని కోరుతూ ఈ పాదయాత్రను చేపట్టానన్నారు. విశాఖపట్నంలో ఈ చారిటీ వాక్ ప్రారంభించానని చెప్పారు. తన సినీ ప్రస్థానానికి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న చిత్రాల నిర్మాతలు ఇటీవల బాగా చితికిపోతున్నారన్నారు. చిన్న చిత్రాలను ఆదరించకపోవటం వల్ల సినీ పరిశ్రమ మనుగడ సాగించలేదన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావాలన్నారు. ప్రత్యేక హోదా, నంది పురస్కారాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ‘నో కామెంట్’ అంటూ దాటవేశారు.