విజయవాడ

రిజర్వుడ్ ఎస్‌ఐ కుటుంబానికి బీమా నగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 21: విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన రిజర్వు ఎస్‌ఐ కుటుంబానికి ప్రమాద బీమా నగదు అందింది. బీమాను నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్, యాక్సిస్ బ్యాంకు అధికారులతో కలిసి రిజర్వు ఎస్‌ఐ కుటుంబ సభ్యులకు అందచేశారు. నగర పోలీసుశాఖ సిబ్బందికి ప్రత్యేక జీతభత్యాల ప్యాకేజీని ఇచ్చేందుకు యాక్సిస్ బ్యాంకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 16న పోలీసుశాఖకు బ్యాంకుతో అంగీకార ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్రమాద బీమా, టెర్రరిజం, నక్సలిజం, మాబ్ విధులు నిర్వహిస్తూ మృతి చెందిన పోలీసు సిబ్బందికి రూ.30లక్షలు వ్యక్తిగత బీమా, శాశ్వత అంగవైకల్యం ప్రమాద బీమా భద్రత 30లక్షలు, పాక్షిక అంగవైకల్య బీమా భద్రత 5లక్షలు, ఒక కోటి విమాన ప్రయాణ బీమా భద్రత, ఒక లక్ష వరకు ఒక్కొక్కరికి ఉచిత ఉన్నత విద్య బీమా భద్రత (వారి పిల్లలకు) నాలుగేళ్ల వరకు, ఉద్యోగ విరమణ తర్వాత కూడా పై ఉదహరించిన సదుపాయాలన్నీ వారి జీతం ఖాతాను, పెన్షన్ ఖాతాలోకి మార్చుకున్నచో వర్తించేలా ఈ ఒప్పందం కుదిరింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రిజర్వు ఎస్‌ఐ ఎంకె దుర్గారావు మరణం తర్వాతే యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందం జరిగింది. అయినా పెద్ద మనసుతో ముందుకు వచ్చిన బ్యాంకు బీమా సొమ్ము అందచేశారు. కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న దుర్గారావు ఆగస్టు 10న వీఐపీ భధ్రతా విధుల్లో ఉన్నారు. అదే రోజు రాత్రి ఏఆర్ నుంచి మంగళగిరిలోని ఇంటికి వెళ్తూ బైక్ వడ్డేశ్వరం జాతీయ రహదారిపై మృత్యువాత పడ్డాడు. అప్పటికీ అంగీకార ఒప్పందం ప్రక్రియ పూర్తి కానప్పటికీ 20లక్షలు బీమా అందచేయడం విశేషం. భార్య ఎం ఇందిరా, కుమారుడు రాజేష్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీతోపాటు డీసీపీ జె బ్రహ్మారెడ్డి, సిటీ స్పెషల్ బ్రాంచి ఏసీపీ రమేష్‌బాబు, హెడ్ క్వార్టర్ ఏసీపీ కోటేశ్వరరావు, ఏఓ రాజా భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.