విజయవాడ

అనుమతిలేని పోస్టర్లు, ప్లెక్సీలు తొలగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 21: నగర సుందరీకణకు విఘాతం కల్పిస్తున్న వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లతోపాటు ప్రకటన అట్టలను నియంత్రించి పరిసరాల సుందీరకణకు సహకరించాలని, లేని పక్షలంలో వారిపై మున్సిపల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడునని వీఎంసీ కమిషనర్ జె నివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం తన ఛాంబర్‌లో ఆయా సినీమా థియేటర్లు, ముద్రణా సంస్థల ప్రతినిథులతో సమావేశమైన నివాస్ నగర సుందరీకరణ చర్యలను వివరిస్తూ ఆయా చర్యలకు విఘాతం కల్పిస్తున్న వైనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర వ్యాప్తంగా ఎక్కడైనా, ఎప్పుడైనా ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లను ఏర్పాటుచేయదలిస్తే నిబంధనల ప్రకారం విధిగా తగు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఆయా నిబంధనలను పాటించని వారిపై తీసుకునే చర్యల్లో ఆయా సంస్థల అనుమతులను సైతం రద్దు చేయబడునని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిటీ ప్లానర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.