విజయవాడ

ఉత్సాహంగా టెన్నిస్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 23: విజయవాడ సీనియర్ టెన్నిస్ ఫ్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో గురువారం ఆల్ ఇండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ రెండో రౌండ్‌కు చేరుకున్నాయి. 45+ విభాగం సింగిల్స్ రెండో రౌండ్‌లో సుభాష్‌పాటెల్ (గుజరాత్)పై 6-2, 6-0తేడాతో మణికంధన్ (తమిళనాడు), అన్నం వెంకటేశ్వర్లు (ఆంధ్రప్రదేశ్)పై 6-3,6-4తేడాతో దినేష్‌కుమార్ (తమిళనాడు), అశిష్‌మల్పని (కర్నాటక)పై 6-1, 6-2తేడాతో ప్రభంజన్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్), ఎస్‌కె ఇమ్రాన్ (ఆంధ్రప్రదేశ్)పై 6-2, 6-0 తేడాతో బాబురాజ (ఆంధ్రప్రదేశ్), డి హేమంత్‌కుమార్ (ఆంధ్రప్రదేశ్)పై 6-3, 6-3 తేడాతోకెవిఎన్ మూర్తి (తెలంగాణ), విశ్వనాధ్‌రాము (కర్నాటక)పై 6-1, 6-3తేడాతో మునికృష్ణరెడ్డి (ఆంధ్రప్రదేశ్)లు విజయం సాధించారు. 55+ విభాగంలో లామా (పశ్చిమబెంగాల్)పై 6-0, 6-1తేడాతో శ్రీనివాసరెడ్డి (ఆంధ్రప్రదేశ్), జోజిరెడ్డి (ఆంధ్రప్రదేశ్) 7-6, 6-7, 6-3తేడాతో మన్మధరావు (ఆంధ్రప్రదేశ్), పామర్తి (ఆంధ్రప్రదేశ్)పై 6-2, 6-2తేడాతో సేతు (తమిళనాడు), ఎం జోయల్‌కుమార్ (ఆంధ్రప్రదేశ్)పై 6-2, 6-2తేడాతో చిన్ని సుధాకర్ (ఆంధ్రప్రదేశ్), రవిశంకర్ (ఆంధ్రప్రదేశ్)పై 5-7, 6-3,10-6తేడాతో పాల్ మనోహర్ (ఆంధ్రప్రదేశ్), డి సత్యమూర్తి (ఆంధ్రప్రదేశ్)పై 6-3. 6-2తేడాతో కె మోహర్‌ప్రకాష్ (ఆంధ్రప్రదేశ్), వి రాజగోపాలన్ (తెలంగాణ)పై 6-2, 6-2తేడాతో ఆర్ విజయ్‌వర్ధన్ (ఆంధ్రప్రదేశ్), ఆర్ శ్రీధర్ (కర్నాటక)పై 6-2, 6-2తేడాతో మేఘనాథన్ (తమిళనాడు)లు గెలుపొందారు. 65+ విభాగంలో బిజి రెడ్డి (ఆంధ్రప్రదేశ్)పై 6-2, 6-1తేడాతో డా రామమోహనరావు, మదన్‌మోహన్ సింగ్ (తెలంగాణ)పై 6-3, 6-0తేడాతో కె రాధకృష్ణమూర్తి (ఆంధ్రప్రదేశ్), ఎంఎస్ ప్రకాష్ (ఆంధ్రప్రదేశ్)పై 6-3, 6-4తేడాతో ఎంఎస్ వెంకటచలం (తమిళనాడు), సిపి రాజు (ఆంధ్రప్రదేశ్)పై 6-3, 6-3తేడాతో సుధాకర్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్), జీవవిలియమ్స్ (ఆంధ్రప్రదేశ్)పై 6-1, 6-0తేడాతో విఆర్ కులకర్ణి (కర్నాటక), ఎజెజయకుమార్ (కర్నాటక)పై 6-1, 6-0తేడాతో ఎస్ పరిఖ్ (మహరాష్ట్ర), ఎఆర్ రావు (ఆంధ్రప్రదేశ్)పై 6-1, 6-0తేడాతో అంకయ్య (ఆంధ్రప్రదేశ్), కెఎస్‌ఆర్ మోహనరావు (తెలంగాణ)పై 6-3, 6-4తేడాతో పి పద్మలు (ఆంధ్రప్రదేశ్)లువిజయం సాధించారు.

సబ్సిడీపై ట్రాక్టర్లు
ఇబ్రహీంపట్నం, నవంబర్ 23: రైతులు పొలాలను సాగు చేసుకునేందుకు సబ్సిడీపై చంద్రన్న రైతు రుణం కింద సబ్సిడీతో ట్రాక్టర్లు అందజేస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. మండలంలోని మూలపాడు గ్రామంలో చంద్రన్న రైతు రుణ పథకం ద్వారా ఇద్దరికి ట్రాక్టర్లు అందజేశారు. గ్రామ సర్పంచ్ బి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గురువారం మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి చంద్రన్న రుణం పథకం ద్వారా మండలంలో 12 ట్రాక్టర్లు మంజూరు కాగా వాటిలో 2 స్వరాజ్ ట్రాక్టర్లు ఇవ్వటం జరిగిందని మిగిలిన వారికి కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ట్రాక్టరుకు ప్రభుత్వం రూ.1.5 లక్షలు సబ్సిడీ ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గురజాల సాంబశివరావు, గరికపాటి శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి డి.శైలజ, రాజశేఖర్, మేరమ్మ, కెనడి, సంజీవరావు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ డ్యాన్స్, మ్యూజిక్ ఫెస్టివల్
విజయవాడ, నవంబర్ 23: వచ్చే నెల 2,3న ఇంటిగ్రేటెడ్ డ్యాన్స్, మ్యూ జిక్ పేరిట ముంబయిలోని డివై పాటి ల్ స్టేడియంలో అతి పెద్ద డ్యాన్స్, మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించబోతున్నట్లు లైఫ్ స్టెయిల్ బ్రాండ్ ఇంటిగ్రిటీ వెల్లడించింది. ఈ ఫెస్టివల్‌లో ప్రవేశం కోసం ఎడైన్ ఇంటిగ్రేటెడ్ స్టోర్‌లో రూ. 2,999ల విలువైన షాపింగ్ చేస్తే సరిపోతుందని, కౌవాల్ కిరణ్ క్లాతింగ్ డైరెక్ట ర్ వికాస్ జైన్ తెలిపారు.