విజయవాడ

కార్పొరేటర్ల విజ్ఞాన యాత్రకు రూ.4లక్షల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 23: కార్పొరేటర్ల విజ్ఞాన యాత్రకు రూ.4లక్షలను కేటాయించాలని మేయర్ కోనేరు శ్రీ్ధర్ సూచించారు. రానున్న వార్షిక బడ్జెట్ రూపకల్పనలో భాగంగా గురువారం ఉదయం తన ఛాంబర్‌లో యుసీడీ, రెవెన్యూ, లీగల్‌సెల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు సూచనలు చేశారు. కార్పొరేటర్ల విజ్ఞాన, విహార యాత్రకు 4లక్షలు కేటాయించడంతోపాటు నిరుద్యోగుల స్వయం ఉపాధి, స్కిల్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొరకు 4 లక్షలు, మహిళా శిశు సంక్షేమానికి 5లక్షలు, వృద్ధుల సంక్షేమానికి 5లక్షలు, స్ట్రీట్ వెండర్స్ అభివృద్ధి కొరకు కోటి, పట్టణ ఉపాథి పథకానికి 24 లక్షలు, నైట్ షెల్టర్ భవనాల నిర్వహణకు కోటి 52 లక్షలు, సోషల్ మైబలైజేషన్ డెవలప్‌మెంట్ కు 50 లక్షల రూపాయలను కేటాయిస్తూ ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సమావేశంలో అకౌంట్స్ ఆఫీసర్ కె సత్యనారాయణ, డీసీఆర్ జి సుబ్బారావు, అసిస్టెంట్ కమిషనర్లు సిహెచ్ అనసూయ, తుమ్మల శ్రీనివాస్, వి సుధాకర్, లీగల్ సెల్ ఇన్‌చార్జ్ సి వెంకటేశ్వరరావు, మేనేజర్ ఎ నాగకుమారి తదితరులు పాల్గొన్నారు.

మెటీరియల్ కేటాయింపులకు చర్యలు తీసుకోవాలి
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 23: అమరావతి రాజధాని నగరంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టు పనులకు అవసరమైన మెటీరియల్ కేటాయింపులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం సీఆర్‌డీఏ కార్యాలయంలో అమరావతి అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ లక్ష్మీపార్థసారధి తో కలిసి నిర్మాణ సంస్థలైన ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీ, షాపూర్జీ పల్లోంజీ, బీఎస్‌ఆర్, మెగా కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమై నిర్మాణ పనులపై సమీక్షించారు. ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్మించనున్న అమరావతి భవనాల నిర్మాణాలకు కావాల్సిన ఇసుక, గ్రావెల్ కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలను గుంటూరు జిల్లా కలెక్టర్‌కు పంపించడం జరిగిందని, త్వరలోనే ఆయా ప్రతిపాదనలకు కార్యరూపం వస్తుందని తెలిపారు. కాంట్రాక్ట్ సంస్థలు తమకు కేటాయించిన ప్రాజెక్టులను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ఎటువంటి అలసత్వం లేకుండా ఏరోజు పని ఆరోజు పూర్తయ్యేలా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ సగిలి షణ్మోహన్, ఏడీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ జి రత్నకుమార్, ఏడీసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్లానింగ్ డిజైన్ చీఫ్ కెవి గణేష్‌బాబు, సీఆర్‌డీఏ సీఈ ఎంఎ షుకూర్, ఎస్‌ఈ లు ఎం జక్రయ్య, సిహెచ్ ధనుంజయ, జె శ్రీనివాసులు, ప్రాజెక్టు మేనేజర్ దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛతలో నగరాన్ని అగ్రభాగాన నిలపాలి
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 23: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా విజయవాడ నగరాన్ని అగ్రభాగాన నిలిపేందుకు అందరూ కృషి చేయాలని మేయర్ కోనేరు శ్రీ్ధర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం కౌన్సిల్ హాల్లోని వీఎంసీ ఉపాధ్యాయులకు స్వచ్ఛాంధ్ర యాక్షన్ కిట్లను ఉపయోగించే విధానంపై యూనైటెడ్ వాష్ స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధి కింజల్ శర్మ తో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ విద్యార్థులకు స్వచ్ఛత, పరిశుబ్రత లపై అవగాహన కల్పించే విషయంలో టీచర్లు కీలకమని, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులు అందించే యాక్షన్ కిట్‌ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. చిన్ననాటి నుంచే పిల్లలో పారిశుద్ధ్యం, వ్యక్తిగత శుబ్రతపై ఆటలతో వివరించాలన్నారు. ప్రస్తుతం అందిస్తున్న కిట్ సుమారు 5వేల రూపాయల విలువ ఉంటుందని, వీటిని సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, ఇన్‌చార్జ్ కమిషనర్ డి చంద్రశేఖర్, డివైఇవో కె దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.