విజయవాడ

ప్రభుత్వాస్పత్రిలో కవలల మరణం కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 23: తొలి కాన్పులో కలిగిన కవలలను చూసి ఆ దంపతులు మురిసిపోయారు. ఒకేసారి మగ బిడ్డలు పుట్టారన్న వారి ఆనందానికి అవధుల్లేవు. అయితే శిధి వక్రీకరించింది. వారి సంతోషం ఎంతోసేపు ఉండలేదు. పురిటిలోనే బిడ్డలిద్దరూ మృత్యువాత పడటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. 2రోజుల వయస్సు మగ కవలలు కళ్లముందే విగతులై కనిపించడం వారిని గుండె కోతకు గురి చేస్తోంది. అయితే ఈ శోకానికి వేదిక ప్రభుత్వాస్పత్రి కావడం కలకలం రేపింది. ఒకే కాన్పులో పుట్టిన కవలలు ఒకే రోజు గంటల తేడాతో గురువారం మరణించడం వెనుక తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పసికందుల మరణానికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని కవలల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతానికి చెందిన భావన నారాయణరావు శారదా కళాశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయన భార్య పార్వతి గర్భవతి కావడంతో ఈనెల 21న ప్రవసం కోసం పాత ప్రభుత్వాస్పత్రిలో చేర్చాడు. ఆరోజు ఆపరేషన్ చేసిన వైద్యులు ఇద్దరు మగ కవలబిడ్డలకు ప్రాణం పోశారు. అయితే తల్లిదండ్రులు చెబుతున్నట్లు అప్పటి నుంచి 2రోజుల ఆరోగ్యంగా ఉన్న తమ పసికందుల్లో ఒకరు అనుకోకుండా గురువారం ఉదయం శరీరం వేడెక్కడంతో వైద్యులకు తెలియచేశామని, అయితే పరీక్షించిన వైద్యులు బిడ్డ చనిపోయినట్లు నిర్థారించారని చెప్పారు. శోకసముద్రంలో ఉన్న ఉండగానే మరో దుర్వార్త వినాల్సి వచ్చింది ఆ తల్లి దండ్రులు. రెండో బిడ్డ అస్వస్థతకు గురికావడంతో మరలా పరీక్షించిన వైద్యులు బిడ్డకు ఇన్‌ఫెక్షన్ సోకిందని చెప్పారని, అంతలోనే బిడ్డ మృత్యువాత పడినట్లు తెలిపారు. అంటే పుట్టిన తర్వాత 2రోజులు ఆరోగ్యంగా ఉన్న బిడ్డలు ఆ తర్వాత వైద్యుల నిర్లక్ష్యంతోనే మృత్యువాత పడ్డారని ఆరోపిస్తూ తండ్రి నారాయణరావు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే వైద్యుల వైఖరిని నిరసిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పి సర్దుబాటు చేయడంతో పరిస్థితి కంట్రోల్ చేశారు. పుట్టిన బిడ్డలిద్దరూ అనారోగ్యంతోనే మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. కాగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలి
* కలెక్టర్ లక్ష్మీకాంతం
విజయవాడ (ఎడ్యుకేషన్), నవంబర్ 23: నేడు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. బందరురోడ్డులో ఏర్పాటు చేసిన వాల్‌నట్ స్కూల్ ఆఫ్ ఐడియాస్‌ను గురువారం ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ముందుకు పోవడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అధ్యయనం చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. దీనివలన ఈపోటీ ప్రపంచంలో త్వరితగతిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. నేటి విద్యావిధానాలకు భిన్నంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వాల్‌నట్ స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ వంశీదత్ మాట్లాడుతూ ఈసంస్థ డిస్కవరీ నాలెడ్జ్ అనుబంధ సంస్థ అన్నారు. ప్రధానంగా స్వయం ఉపాధిని పొందే దిశగా విద్యార్థులకు పలు అంశాలలో శిక్షణను అందిస్తామని పేర్కొన్నారు. చిన్నతనం నుండే చిన్నారులలో జ్ఞాపకశక్తి పెంపొందించే విధంగా తాము కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈశిక్షణ 21నుండి 45రోజులు ఉంటుందని, అందుబాటులో ఫీజులు నిర్ణయించామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ, కె సతీష్‌కుమార్, ఎం దినేష్‌కుమార్, వి విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.