విజయవాడ

హింసలేని సమాజం మహిళల హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: రాజ్యాంగంలో మహిళల సమానత్వం గ్యారెంటీ చేయబడిందని కాని పురుషాధిక్య సమాజంలో మహిళలు హింసకు గురవుతున్నారని అందుకే హింసలేని సమాజం సాధించుకోవాలని హింసా వ్యతిరేక ప్రచార సందర్భంగా ఆడ పిల్లని పుట్టనిద్దాం, పెరగనిద్దాం, స్వేచ్ఛనిద్దాం అనే అంశంపై ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో సోమవారం జరిగిన సదస్సులో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డీ రమాదేవి అన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అందాల పోటీలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు మహిళల శరీరాలపై వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రతి వెయ్యి మంది మగవాళ్లకి 927 మంది ఆడపిల్లలు మాత్రమే ఉండటానికి కారణం స్ర్తిలను తక్కువగా చూడటమేనన్నారు. ఆడపిల్ల అని ముందుగానే తెలుసుకుని కడుపులోనే అంతమొందిస్తున్నారన్నారు. కానీ సామాజిక ఉత్పత్తిలో మహిళల శ్రమ కీలకమని ఆడపిల్ల విశిష్టతకు తెలియపరచారు. కళాశాల అధ్యాపకురాలు అరుణ మాట్లాడుతూ ఆడపిల్లలు ధైర్యంగా ఉంటే ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోగలమని, అన్యాయంపై స్పందించాలని కోరారు. కార్యక్రమంలో నగర సెంట్రల్ సిటీ నాయకులు షకీలా, ఆషా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఏసుబాబు, రఘు, రేణుక పాల్గొన్నారు.

మూలపాడు హైస్కూల్‌లో
డీఆవో ఆకస్మిక తనిఖీ
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 11: మండలంలోని మూలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎంవీ రాజ్యలక్ష్మి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 10వ తరగతి విద్యార్థులను గణితం, భౌతికశాస్త్రంపై పలు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇదే ఆమె తొలి తనిఖీ. పదో తరగతి విద్యార్థులకు 10కి 10 గ్రేడ్ మార్కులు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, మండల విద్యాశాఖాధికారి పుష్పలత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ
అథ్లెటిక్స్ జట్ల ఎంపిక
విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 11: డా. ఎన్టీఆర్ ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం అథ్లెటిక్స్ పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డా. ఇ త్రిమూర్తి తెలిపారు. ఎంపికైన జట్లు 12 నుండి 16 వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగనున్న అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల అథ్లెటిక్స్ పురుషుల, మహిళల చాంపియన్‌షిప్‌లో పాల్గొంటాయన్నారు. పురుషుల విభాగంలో జి విజయ్‌కుమార్, కె వెంకటసాయిరామ్ (సిద్ధార్థ మెడికల్ కళాశాల), టి ఆదిత్య (డా. పిన్నమనేని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్, జి యశ్వంత్, ఎల్ గిరీష్‌నాయుడు, ఎ కృష్ణవర్ధన్, ఇ సుభాష్, బి రామ్‌కుమార్ (రంగరాయ మెడికల్ కళాశాల), బి నాగసాయిబాబు, కె పూర్ణచంద్రరావు, జి సాయికృష్ణ (ఆశ్రమ్ మెడికల్ కళాశాల), స్టాండ్‌బైలుగా ఎం నిఖిల, ఎల్ కళ్యాణి, పి దీక్ష, ఆర్ లావణ్య (రంగరాయ కళాశాల) ఎంపికయ్యారు.