విజయవాడ

నేడు వీఎంసీ కౌన్సిల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 12: విజయవాడ నగర పాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మూడు నెలల తరువాత జరుగుతున్న ఈ సమావేశంలో మేయర్ కోనేరు శ్రీ్ధర్ కొంత ఇరకాటంలో పడనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి, ఆదాయం పేరిట వీఎంసీ ఆస్తులను, భూములను ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు తెరమీదకు తీసుకొచ్చిన పబ్లిక్ ప్రైవేట్, పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంపై విపక్షంలోనే కాక స్వపక్షంలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అజెండాలో 3వ అంశంగా కౌన్సిల్ ఆమోదానికి వస్తున్న ఈవిషయంపై మేయర్ ఏ విధంగా వ్యవహరిస్తారన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొంత మంది అధికార టీడీపీ కార్పొరేటర్లు బహిరంగంగానే వ్యతిరేకిస్తూ కౌన్సిల్‌లో దీనిని అడ్డుకొంటామని పేర్కొంటుండడం గమనార్హం. రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో వీఎంసీకి స్థలాల కొరత అధికంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆయా స్థలాల్లో అవసరమైన నిర్మాణాలను చేపట్టాల్సింది పోయి, కేవలం కొద్దిపాటి ఆర్థిక ప్రయోజనాల కోసం, పీపీపీ పద్ధతిలో ధారాదత్తం చేస్తామనడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న హనుమాన్‌పేటలోని జంధ్యాల దక్షిణామూర్తి పాఠశాల, వీఎంసీ గెస్ట్‌హౌస్‌లోని పాత భవనం తోపాటు బృందావన్ కాలనీలోని మున్సిపల్ క్వార్టర్స్ తదితర స్థలాలు ప్రస్తుత మార్కెట్ విలువ ఎంతో ఉన్న నేపథ్యంలో వీటిపై కనే్నసిన కార్పొరేట్ సంస్థలు పీపీపీ మోడ్‌ను తెరమీదకు తీసుకొచ్చాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. గతంలో ఈ పద్ధతిలో వీఎంసీ స్థలాలు ఇచ్చి నష్టపోయినా మళ్లీ అదేదారి ఎంచుకోవడాన్ని బుధవారం జరిగే కౌన్సిల్లో అధికార పక్షం ఎలా సమర్థించుకుంటుందో వేచి చూడాల్సిందే. అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల లేవనెత్తిన పలు అంశాలు కీలకమనే చెప్పాలి. వీఎంసీ ప్రధాన కార్యాలయం ఆవరణలో నూతన భవన నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ, మళ్లీ ఆ భవన నిర్మాణాన్ని కొనసాగించేలా కౌన్సిల్ సభాముఖంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని, పర్యాటక అభివృద్ధి పేరుతో వీఎంసీ కార్యాలయాన్ని తరలించే చర్యలకు పూనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిలిపివేయాలని కోరుతూ ప్రవేశ పెట్టిన ప్రతిపాదనలపై అధికార తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వీటితోపాటు వివిధ అంశాలపై నగర కార్పొరేటర్లు ప్రతిపాదించిన మొత్తం 85 అంశాల తోపాటు 88 సెక్షన్ కె ప్రకారం అధికారులు ప్రవేశపెట్టే అంశాలపై వాడివేడి చర్చలు జరుగనున్నాయి.

ఆధునిక సాంకేతికతతో రోడ్ల పారిశుద్ధ్యం
* మిషన్ పనితీరును పరిశీలించిన మంత్రి నారాయణ, కమిషనర్ నివాస్, మేయర్ శ్రీ్ధర్

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 12: నగర రహదారుల పారిశుద్ధ్య చర్యల్లో ఆధునిక సాంకేతికతతో కూడిన మెకానికల్ మిషన్‌ను వినియోగించడం వలన మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించవచ్చని వీఎంసీ కమిషనర్ జె నివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జటయు కంపెనీ తయారు చేసిన గార్బేజ్ సక్కింగ్ మెకానికల్ మిషన్ వాహన పనితీరును పరిశీలించేందుకు మంగళవారం ఉదయం రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి నారాయణ, వీఎంసీ కమిషనర్ జె నివాస్, మేయర్ కోనేరు శ్రీ్ధర్, డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు తదితరులు వాహన డెమోను వీక్షించారు. రోడ్లను శుభ్రంచేసే ప్రక్రియలో రాళ్లు, చెత్త, చెదారం, బాటిళ్లు, తదితర వాటిని కూడా ఈ వాహనం తొలగిస్తున్న ప్రక్రియను ప్రయోగాత్మకంగా వీక్షించారు. ఈ వాహనం చిన్నదిగా ఉండటం వలన చిన్న రోడ్లలో కూడా పారిశుద్ధ్య చర్యలను చేపట్టవచ్చునని తెలిపారు. గంటకు 3 లీటర్ల డీజిల్ వినియోగంతో టన్ను చెత్తను సేకరించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పాలా ఝాన్సీ, పలువురు అధికారులు పాల్గొన్నారు.