విజయవాడ

బుగ్గనకు బుర్ర ఉందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోందని, అనవసరమైన రాద్ధాంతం సృష్టించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అడ్డుకోవాలన్నదే వైసీపీ పన్నాగమని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆరోపించారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ బాధ్యతలేని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి తానా అంటే ఆ పార్టీ మరో నేత బుగ్గన తందాన అంటూ వంత పాడుతున్నారని, అసత్యాలతో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడని, అసలు ఇలాంటి వ్యక్తి బీఏసీ చైర్మన్ ఏ విధంగా అయ్యారో అర్థం కావడం లేదన్నారు. పోలవరానికి సంబంధించిన లెక్కలు ప్రభుత్వం పదే పదే చెబుతున్నా, పోలవరం వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొన్నా బుగ్గన మీడియా సమావేశంలో అన్నీ అబద్ధాలు చెబుతున్నారన్నారు. పోలవరంలో పనులు జరగడం లేదని బుగ్గన మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు పనులు చేయకపోతే ప్రాజెక్టులో 50 శాతం పైగా పనులు ఎలా పూర్తవుతాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 2009 నుంచి 2013 వరకు పోలవరంలో ఒక చిన్న పనినైనా చేపట్టారో లేదో చెప్పాలన్నారు. గతంలో వైఎస్ పోలవరంలో రూ.5వేల కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారని, మరి రూ.10,150 కోట్ల ప్రాజెక్టులో రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తి కావాలి కదా? ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఆనాడే రాజశేఖర్‌రెడ్డి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.3వేల కోట్లు ఖర్చుచేసి ఉంటే నేడు భూపరిహారం కింద రూ.33వేల కోట్లు ఖర్చుచేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదని, పరిహారం ఇంతా పెరగడానికి కారణం ఆనాడు వైఎస్ చేసిన పాపమేనన్నారు. బుగ్గన చెప్పిన లెక్కల ప్రకారం చూసినా 2014లో ప్రాజెక్టు వ్యయం రూ.16వేల కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని అనుకుంటే.. నాబార్డ్ ద్వారా కేంద్రం రూ.23,514 కోట్లు ఏ విధంగా విడుదల చేస్తుందో చెప్పాలన్నారు.

విలేజ్ మాల్స్ పేరుతో
ప్రజాపంపిణీ వ్యవస్థకు తూట్లు
విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 12: నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెడితే, నేడు చంద్రబాబు తన పేరును అభివృద్ధి చేసుకునేందుకు పథకాల పేర్లను మార్చి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాడని వైఎస్‌ర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, నగర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రన్న మాల్స్ పేరుతో మరోసారి రాష్ట్రంలో భారీ మాయా జాలంతో పెద్ద ఎత్తున దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న టీడీపీ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థకు తూట్లు పొడుస్తోందన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం విలేజ్ మాల్స్‌లో 20 శాతం డిస్కౌంట్ పేరు తో చిన్నచితకా వ్యాపారులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందన్నారు. రాను న్న ఎన్నికల్లో గెలవననే అభద్రతా భా వంతో సుమారు 25 పథకాలకు చంద్ర న్న పేరు పెట్టుకున్నారన్నారు. చంద్రన్న దోపిడీ మాల్స్‌గా వాటికి పేరు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. తన హెరిటేజ్ కోసం చిత్తూరు డెయిరీని నాశనం చేసినట్టుగా కార్పొరేట్ ప్రయోజనాల కోసం చౌకధర డిపోల నాశనానికి వేలేజ్ మాల్స్‌ను తెరపైకి తీసుకువచ్చారన్నారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న కంభంపాటి రామ్మెహన్ వైసీపీపై ఆరోపణలకు స్వస్తిపలకాలని హితవు పలికారు.