విజయవాడ

సొట్టపడిన కలశం వినియోగంపై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, డిసెంబర్ 14: సొట్టపడిన కలశాన్ని ఏర్పాటు చేసినందుకు దేవస్థానం స్థానాచార్యుడు విష్ణ్భుట్ల శివప్రసాద్‌ను సస్పెండ్ చేస్తామని దుర్గగుడి ఇవో ఎ సూర్యకుమారి తెలిపారు. గురువారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఉన్న యాగశాలలో భవానీ దీక్షలు ప్రారంభం రోజున కలశ స్థాపన జరిగింది. ఆ సమయంలోనే సొట్టపడిన కలశాన్ని ఋత్వికులు ఏర్పాటు చేశారు. చివరి రోజైన గురువారం ఉదయం తొలుత హోమగుండం ముందు ఇవో ఎ సూర్యకుమారి నిలబడగా, ట్రస్ట్‌బోర్డు కమిటీ చైర్మన్ వై గౌరంగబాబు, ధర్మకర్తలు పద్మాశేఖర్, వెలగపూడి శంకరబాబు, బడేటి ధర్మారావు కూర్చున్నారు. ఈ సమయంలో అక్కడే ఉన్న విలేఖరులు సొట్టపడిన కలశాన్ని గమనించి ఇవోను వివరణ కోరగా వైదిక వ్యవహారం మొత్తం దుర్గగుడి స్థానాచార్యుడు శివప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతోందని, దీనిపై విచారణ జరిపి అవసరమైతే స్థానాచార్యుడు శివప్రసాద్‌ను సస్పెండ్ చేస్తామని వివరించారు.

అంగన్‌వాడీలు, పీహెచ్‌సీల్లో ఊయలలు
* కలెక్టర్ లక్ష్మీకాంతం

విజయవాడ, డిసెంబర్ 14: జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఊయలలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని చిన్నారుల సంరక్షణతో పాటు తల్లులకు సౌకర్యంగా ఉండేందుకు ఊయల కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. తొలిసారిగా నూజివీడు డివిజన్ తిరువూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఊయల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఇక రక్తహీనత రహితంగా జిల్లా
జనవరిలో రక్తహీనత రహిత, మాల్ న్యూట్రీషియన్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుతున్నామని కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య, స్ర్తి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనతను గుర్తించి వారికి అదనపు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల రాష్టస్థ్రాయిలో జిల్లా నూట్రీషనల్ స్టేటస్‌లో రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. 6 నెలలుగా అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల మొదటి స్థానం సాధ్యపడిందని కలెక్టర్ అన్నారు. తీవ్ర పౌష్టికాహారం లోపంతో సెవరల్లీ అండర్ వెయిట్‌లో ఉన్న శాతం జిల్లాలో గణనీయ ప్రగతిలో ఉన్నామని కలెక్టర్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సెవరల్లీ అండర్ వెయిట్ కేటగిరిలో ఏప్రిల్ నెలలో 2.90 శాతం నమోదు కాగా నవంబరు నెలలో ఆ శాతం 1.52 శాతంతో రాష్ట్రంలోనే కృష్ణాజిల్లా ప్రథమ స్థానం సాధించామని కలెక్టర్ వివరించారు.