విజయవాడ

భూములిచ్చిన రైతులే.. రాజధాని ప్రథమ పౌరులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 14: ప్రపంచ మేటి నగరంగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు అరుదైన గౌరవం దక్కింది. విశ్వనగరంగా రూపొందుతున్న అమరావతి నగరం ప్రణాళికలను పూర్తి చేసుకుని నిర్మాణ పనుల్లో వేగం పెంచే క్రమంలో అమరావతి డీప్ డైవ్ పేరిట అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న రాజధాని రైతులను మంత్రులు, అంతర్జాతీయ మేధావులు, అధికార, అనధికార ప్రముఖుల కరతాళధ్వనులతో అభినందించారు. గురువారం ఉదయం గేట్‌వే హోటల్‌లో అమరావతి డీప్ డైవ్ వర్క్‌షాప్‌లో ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు వర్క్‌షాప్‌లో తొలుత తమను అభినందించటంతో రైతుల్లో ఆనందోత్సావాలు పెల్లుబికాయి. అనంతరం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ రికార్డు సమయంలో భూసమీకరణ జరగడం కేవలం రైతుల సహకారం వల్లేనని, సీఎం చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే రైతులు తమ భూములివ్వడానికి ముందుకొచ్చారని ఉద్ఘాటించారు. అతి తక్కువ సమయంలోనే 33వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి సేకరించాల్సిన మొత్తం భూములలో 90శాతం సమీకరణ ద్వారానే సేకరించామన్నారు. ప్రపంచలో టాప్ సిటీల్లో ఒకటిగా అమరావతి నిలుస్తుందన్న మంత్రి నారాయణ స్టార్టప్ ఏరియాతో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గత మూడేళ్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి నిమిషం తపనతో అమరావతి నిర్మాణానికి కృషి చేస్తున్న వైనం అభినందనీయమన్నారు. రైతుల త్యాగాలకు తగిన విధంగా అమరావతిని నిర్మించేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఏపీసీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ స్వాగతోపన్యాసం చేస్తూ సీఎం విజన్‌కు అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్‌ఫీల్డ్ సిటీగా రూపొందుతుందని, గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఆర్థికాభివృద్ధి కేంద్రంగా రాజధాని నగరం విలసిల్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐకానిక్ భవాలను ఆకర్షణీయంగా, యునిక్ మోడల్ ఫండింగ్ జరుగుతుందని, సీఎం చంద్రబాబు ఇమేజ్‌తోనే పలు కంపెనీలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ సింగ్‌పూర్‌కు ఒక నగరం నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఇది రెండో అవకాశమన్నారు. డీప్‌డైవ్ వర్క్‌షాప్‌లో అమరావతి గ్లోబల్ సిటీగా రూపుదాల్చే విధానాన్ని మెకన్సీ ప్రతినిధులు శిరీష్ సాంఖే, అంకిత్ గుప్తా వివరించారు. సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ మాట్లాడుతూ 1080 రోజుల్లో అమరావతి రాజధాని ప్రయాణరీతులను వివరిస్తూ ప్రతి గంట విలువైనదిగా భావించి కార్యాచరణ రూపొందించామన్నారు. సింగ్‌పూర్ మాస్టర్ ప్లాన్‌తో అత్యున్నత ప్రమాణాల లివబుల్ హ్యాపీ సిటీగా రూపుదిద్దుతామన్నారు. భూ సమీకరణ, ప్లానింగ్, డిజైనింగ్ ఆఫ్ సిటీని సమర్ధవంతంగా పూర్తిచేయగలిగామన్నారు. నయా రాజధాని నగరాలు ఆస్తానా, రాయ్‌పూర్, పుత్రజయ నగరాలతో పోలిస్తే చాలా తక్కువ సమయంలో అమరావతి పనులు పూర్తవుతున్నాయన్నారు. రాజధాని కోసం స్వచ్ఛంధంగా భూములిచ్చిన రైతులను ప్రత్యేకంగా కరతాళధ్వనులతో అభినంధిస్తూ రాజధాని ప్రథమ పౌరులు, ప్రథమ భాగస్వాములు రైతులేనని కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ప్రశంసించారు. ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి మాట్లాడుతూ అత్యున్నత ప్రమాణాలతో రూపొందించిన ప్రణాళికలను సమర్ధవంతంగా అమలు చేస్తామన్నారు. పనులు కూడా నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్నారు. డీఎఫ్‌ఐడి ఇండియా డెప్యూటీ హెడ్ అన్నా ఫ్రెంచ్ మాట్లాడుతూ అమరావతి భాగస్వామ్యంలో యూకే కొలాబరేషన్‌తో చాలా పార్టనర్‌షిప్‌లు ఉన్నాయని, స్మార్ట్ మిషన్‌లో టాప్‌మోస్ట్ సిటీగా అమరావతి రూపొందడానికి తాము సహకరిస్తామన్నారు. మెకన్సీ సీనియర్ అడ్వయిజర్ పెర్రీ, సీఎల్సీ ఈడీ ఘూ టెంగ్చీ, పోస్టర్స్ పార్టనర్స్ ప్రతినిధి పెడ్రో హాంబర్‌బాస్క్ డిజైన్ల విశిష్టతను వివరించారు. అనంతరం వర్క్‌షాప్‌లో పాల్గొన్న పలువురు ప్రతినిధులను శాలువాలతో సత్కరించారు.