విజయవాడ

అన్న ఎన్టీఆర్‌కు సాటి లేరెవ్వరూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 18: తెలుగు సినీ చరిత్రలోనే కాకుండా రాజకీయాల్లోనూ అన్న ఎన్టీ రామారావుకి సరిసాటి ఎవరూ లేరని పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలకు గురువారం సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఎన్టీఆర్‌తోనే రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి జరిగిందని, ప్రతి నిరుపేదకు అవసరమైన తిండి, గృహం, రుణాలు, చివరికి దుస్తులు కూడా పంపిణీ చేసి ఆదుకున్న మహనీయుడని కొనియాడారు. కొందరికే పరిమితమైన రాష్ట్ర రాజకీయాలను కూడా అన్ని వర్గాల దరికి చేర్చి వారి సామాజిక అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం జరగకముందు ఎన్నో కులాల వారు రాజకీయ ప్రాతినిధ్యం లేక, వారి సమస్యలను చట్టసభల దృష్టికి తెచ్చేవారులేక తరతరాలుగా వెనుకబాటుకు గురయ్యారని ఆయన గుర్తుచేశారు. ఆ పరిస్థితిని ఆయన అధిగమించటం అందరికీ ఆదర్శప్రాయమని, నాటి ఎన్టీఆర్ పథకాలే దేశ ప్రగతికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ మార్పులు తెచ్చిన రామారావు దేశ రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేశారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహనీయుడు ఆయనేనన్నారు. నేటితరం వారికే కాకుండా భవిష్యత్తు తరాల వారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచే ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం టీడీపీ శ్రేణులంతా కృషి చేయాలని నాని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, పిన్నంరాజు త్రిమూర్తిరాజు, యేదుపాటి రామయ్య, కోఆప్షన్ సభ్యురాలు చెన్నుపాటి ఉషారాణి, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి పట్ట్భారామ్, 53వ డివిజన్ టీడీపీ కార్యదర్శి కె లూర్థురాజు, నందేటి ప్రేమ్, ఎం చిన్నరంగా పాల్గొన్నార. సభానంతరం వివిధ ఆటల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈసందర్భంగా కళాకారుల కళాప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. 1వ డివిజన్ గుణదలలో కార్పొరేటర్ పిన్నమనేని శివరంజని ఆధ్వర్యంలో జరిగిన వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 53వ డివిజన్ సింగ్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో పేదలకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు, యలవర్తి శ్రీకాంత్, చల్లగాలి అనిల్, చల్లగాలి డేవిడ్, ఘంటా కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.