విజయవాడ

మహారాష్ట్ర గవర్నర్‌కు స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జనవరి 18: శ్రీ కనకదుర్గమ్మవారి దర్శనార్థం సతీసమేతంగా విచ్చేసిన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుకు గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యారావు ఘన స్వాగతం పలికారు. అంతేకాకా విమానాశ్రయం వద్ద గవర్నర్ దంపతులకు స్వాగతం పలికిన వారిలో నగర డెప్యూటీ పోలీస్ కమిషనర్ గజరావుభూపాల్, నూజివీడు ఆర్‌డిఓ సీహెచ్ రంగయ్య, ఏసీపీ రాజీవ్‌కుమార్, తదితరులు ఉన్నారు. అమ్మవారి దర్శనం తర్వాత స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం 1-30గంటలకు తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో బయలు దేరారు.
కలిసిన మంత్రులు
మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు గురువారం ఉదయం నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌కు విచ్చేసిన సందర్భంగా పలువురు మంత్రులు, ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జాయింట్ కలెక్టర్ పిడుగు బాబూరావు, గుడివాడ ఆర్డీవో ఎం చక్రపాణి, లైజాన్ ఆఫీసర్ యుగంధర్, డీపీఆర్‌ఓ ఎం భాస్కర నారాయణ, తదితరులు గవర్నర్‌ను కలసిన వారిలో ఉన్నారు.

గ్రీనరీ పనులు వేగవంతం చేయాలి
* కమిషనర్ నివాస్ ఆదేశం
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 18: నగర సుందరీకరణ పనుల్లో భాగంగా ఫకీర్‌గూడెం బందరు కాలువ గట్టుపై జరుగుతున్న గ్రీనరీ పనులను వేగవంతం చేయాలని వీఎంసీ కమిషనర్ జె నివాస్ ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా గురువారం ఉదయం సుందరీకరణ పనులను పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. మొక్కలు నాటటంతో పాటు కాలువ గట్టుపై వాకింగ్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు. దీనిపై నివాస్ స్పందిస్తూ ట్రాక్ నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రీనరీ పనుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత కాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.