విజయవాడ

20 నుండి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 9: ఈనెల 20 నుండి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం జరుగుతుందని సర్వే శాస్ర్తియబద్ధంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. జిల్లాలో చేయనున్న సమగ్ర కుటుంబ సర్వేపై గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పుష్కర సెల్‌లో సంబంధిత ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఈనెల 20 నుండి 40 రోజులపాటు జరిగే సమగ్ర కుటుంబ సర్వేను అందుబాటులో ఉన్న సమస్త సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ఆధార్, రేషన్, ఓటరు కార్డులతో పాటు గ్యాస్, బ్యాంకు ఖాతాలను ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుందన్నారు. కులాలకు సంబంధించి షెడ్యూల్డ్ కులాలకు సాంఘిక సంక్షేమశాఖ అధికారులు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారులతో సంప్రదించటం జరుగుతుందన్నారు. అవసరమైతే రాష్టస్థ్రాయి అధికారుల సలహాలు, సూచనలు సేకరించటం జరుగుతుందని ఈ సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇంటిలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు వాహనాలు, తదితర వివరాలను స్వీకరించటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.