విజయవాడ

చిన్నారులకు అక్షరాభ్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జనవరి 22: చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి జన్మనక్షత్రం శ్రీ పంచమి సందర్భంగా సోమవారం నగరంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంతో దర్శనం ఇచ్చింది. యనమలకుదురు శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో కొలువైన అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇచ్చింది. ఈవో ఎల్ సత్యవతి సూచనతో ప్రధాన అర్చకుడు కోటేశ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. యనమలకుదురు చుట్టు పక్క ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వేకువ జామునుంచే అధికంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 6గంటల నుండే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న విద్యార్థులకు దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి పెన్ను, లడ్డూ, కుంకుమ ప్యాకెట్ అందచేశారు. ఉదయం 7గంటల నుండి రాత్రి 9గంటల వరకు అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్ధీ కొనసాగింది. ఈకార్యక్రమానికి దేవాదాయశాఖ సహాయ కమిషనర్ వి సత్యనారాయణ, తనిఖీ అధికారి ఎ సుజన్‌కుమార్, ఏసీ కార్యాలయం పర్యవేక్షుకుడు శెట్టి, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కృష్ణలంక పండిట్ నెహ్రూ స్టేషన్ సమీపంలో ఉన్న శ్రీ త్రిశక్తి పీఠం (కాళికాదేవి) ఆలయంలో దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ సరస్వతీదేవికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. పర్యవేక్షుకుడు ప్రసాద్ ఆధ్వర్యంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈసందర్భంగా విచ్చేసిన భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాదాలను అందచేశారు. సత్యనారాయణపురం శివాలయ ప్రాంగణంలో కొలువైన అమ్మవారి సన్నిధిలో శ్రీ సరస్వతీదేవికి ఈవో సీతారావమ్మ సూచనతో అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. శ్రీ పాతబస్తీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కొలువైన అమ్మవారికి ఇవో ఎం హేమలతాదేవి సూచనతో అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు.