విజయవాడ

పోస్ట్ ఆపరేటివ్ వార్డులో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), ఫిబ్రవరి 16: విజయవాడ డివిజనల్ ప్రధాన ఆసుపత్రిలో ఘోర ప్రమాదం తప్పిం ది. ప్రాణనష్టం జరగలేదు కాని స్వల్ప ఆస్తినష్టం సంభవించింది. సంఘటన స్థలాన్ని శుక్రవారం డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్.్ధనుంజయులు పరిశీలించారు. గురువారం అర్ధరాత్రి సమయం లో పోస్ట్ ఆపరేటివ్ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు ఆసుపత్రి విభాగం లోని సిబ్బంది కలిసి అగ్నిమాపక నిరోధక పరికరంతో కొంతమేర మంటల ను అదుపు చేశారు. ఇంతలో అగ్నిమాపక శకటం వచ్చి పూర్తి స్థాయిలో నివారించారు. ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తం గా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిం ది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగిన సమయంలో పోస్టు ఆపరేటివ్ వా ర్డులో రోగులున్నారు. వీరిని ముందు గా బయటకు పంపించే చర్యలు సి బ్బంది తీసుకున్నారు. శుక్రవారం ఉద యం ధనుంజయులు సంఘటన స్థలా న్ని పరిశీలించి అనంతరం విద్యుత్ సి బ్బందిని పిలిపించి తక్షణం మరమ్మతు లు చేపట్టారు. అయితే దీనికి కారణాల పై ధనుంజయులు విచారిస్తున్నట్లు స మాచారం. సంఘటన జరిగిన వెంటనే ఆసుపత్రి ప్రధానాధికారి అక్కడికి చేరి పరిస్థితిని సమీక్షించారు. పోస్టు ఆపరేటివ్ వార్డులో శుక్రవారం వివిధ సం ఘాలకు చెందిన నాయకులు, తదితరులు పరిశీలించారు.

ఓపెన్ ఫోరంలో 7 దరఖాస్తులకు అనుమతులు
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 16: భవన నిర్మాణ ప్లాన్లు, లే అవుట్‌ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీఆర్‌డీఏ నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరం సద్వినియోగం చేసుకోవాలని సీఆర్‌డీఏ డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ కె నాగసుందరి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో నిర్వహించిన ఓపెన్ ఫోరంలో మొత్తం 8 దరఖాస్తులు రాగా నిబంధనలకు అనుగుణం గా ఉన్న 7 దరఖాస్తులకు తక్షణ అనుమతులు మంజూరు చేశారు. లే అవుట్ అనుమతుల కోసం వచ్చిన 2 దరఖాస్తులు, పరిశ్రమ ఏర్పాటుకు వచ్చిన ఒక దరఖాస్తు, పెట్రోల్ బంక్ ఏర్పాటుకోసం వచ్చిన 2 దరఖాస్తులను, రిలీజ్ ఆఫ్ మార్టిగేజ్ ఏరియా ఆక్యుపెన్సీ సర్ట్ఫికేట్ కోసం వచ్చిన 2 దరఖాస్తులు, రిలీజ్ ఆఫ్ మార్టిగేజ్ ఏరియా ఫైనల్ లే అవుట్ కోసం వచ్చిన ఒక దరఖాస్తుల ను పరిశీలించిన అధికారులు ప్రాథమి క అనుమతులను మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌డీఏ జాయిం ట్ డైరెక్టర్ కె ధనుంజయరెడ్డి, బీ బా లాజీ తదితరులు పాల్గొన్నారు. రాజధాని రీజియన్ పరిధి ప్రాంతాలను ప్ర ణాళికాబద్ధంగా అమలుచేయనున్న త రుణంలో భవన నిర్మాణదారులందరూ నిబంధనలకనుగుణంగా తమ నిర్మాణాలను చేపట్టాలని, అక్రమ నిర్మాణాల ను ఎట్టిపరిస్థితిలోనూ అనమతించేది లేదని ఆయా నిర్మాణాలపై కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.