విజయవాడ

యువత ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: యువత తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత స్థాయికి చేరుకునేలా నిరంతరం కృషి చేస్తుండాలని కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం అన్నారు. శుక్రవారం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాను ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల, జవహర్ నాలెడ్జి సెంటర్, జిల్లా ఉపాధికల్పానా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కా ర్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం మాట్లాడుతూ యువత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత జాబ్ మే ళా ద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఉద్యోగం చేస్తూ మంచి నైపుణ్యం, సామర్థ్యం, మెళకువలు అలవర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేవలం వ్యవసా యం, వాటి అనుబంధాలే కాక విద్య, వైద్యంతో పాటు మానవ సూచీల అభివృద్ధి ఉండాలన్నారు. ఆ దిశగా కృష్ణాజిల్లా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. జిల్లా తలసరి ఆదాయం అన్ని జిల్లాలు కంటే అగ్రభాగాన ఉందని అదే విధంగా స్థూల ఆదాయంలో కూడా జిల్లా అగ్రభాగ్లోంనే ఉందన్నారు. జిల్లా రెండంకెల వృద్ధిరేటుతో ఇతర జిల్లాల కంటే మొదటి స్థానంలో ఉన్నందున జిల్లా ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. కౌశల కృష్ణాలో భాగంగా మార్చి 31నాటికి జిల్లాలో 25 వేల మంది నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కృషి చేస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళాలో ఆయా కంపెనీలు విద్యార్హతను బట్టి రూ.8వేలు నుంచి రూ.20వేల వరకు నెల జీతం పొందే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలల ప్రిన్సిపాల్ డా. వెలగ జోషి, జేకేసీ కో-ఆర్డినేటర్ వి.అరుణకుమారి, జిల్లా ఉపాధి కల్పనాధికారి రమేష్‌బాబు, స్థానిక కార్పొరేటర్ కె.శేషురాణి, 17 కంపెనీలకు చెందిన జాబ్ ప్రొవైడర్స్ పాల్గొన్నారు.