విజయవాడ

తేలనున్న ‘లెక్క’కు లెక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 16: పట్టణ ప్రణాళికా విభాగంలో మితిమీరిన అవినీతి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. ఈమేరకు నగరంలో నిర్మితమైన, నిర్మితమవుతున్న భవనాలపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులకు కళ్లు చెదిరే నిజాలు బహిర్గతమవుతున్నాయి. ఇటీవల కాలంలో టౌన్ ప్లానింగ్ అధికారులపై జరిపిన ఏసీబీ దాడులలో వందల కోట్లను కూడగట్టిన వైనంతో దిమ్మదిరిగిన ఏసీబీ, విజిలెన్స్ అధికారులు, అంతటి అక్రమ సొమ్ములు ఎలా సంపాదిస్తున్నారన్న విషయాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు దిగారు. నగరంలో 10వేలకు పైగా అక్రమ భవనాల నిర్మితమైనాయన్న విషయం అధికారిక లెక్కలే చెబుతున్నాయి. పెరుగుతున్న నగర జీవన, వ్యాపార అవసరాలకు అనుగుణంగా పెరుగుతున్న భవనాల నిర్మాణాలు ప్రస్తుతం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమవుతున్న భవనాలను చూసి సర్వే అధికారులు విస్తుబోతున్నారు. అక్రమ భవనాలపై పరిశీలనకు ప్రత్యేకంగా దిగిన ఏసీబీ అధికారుల పరిశీలనలతో అక్రమ భవన నిర్మాణదారులతోపాటు ఆయా నిర్మాణాలకు ఊతమిచ్చిన సిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు, ప్రజాప్రతినిధులకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. ఒకొక్క భవనానికి లక్షకు పైగానే వసూలు చేసి దండుకు తిన్న అవినీతి తిమింగలాలకు మింగుడు పడని ఈ పరిశీలనలపై తీవ్ర అందోళనకు గురవుతున్నారు. అక్రమ భవనాలు, వాటి పరిస్థితులపై క్షేత్రస్థాయి పరిశీలన సర్వే రిపోర్టులను సిద్ధం చేస్తున్న అధికారులు తదుపరి చర్యలేమిటన్నది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఇదిలావుండగా వీఎంసీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత విచ్చలవిడి నిర్మాణాలు జరుగుతున్నాయని, వీటి వెనుక టీడీపీ ప్రజాప్రతినిధులే దళారులుగా మారి నిర్మిస్తున్నారన్న ఆరోపణలు వినిపించడమే కాకుండా ఇటీవల వీఎంసీ టీడీపీలో మేయర్, కార్పొరేటర్ మధ్య చోటుచేసుకున్న అవినీతి ఆరోపణలలో ప్రధానంగా అక్రమ నిర్మాణాలే ఉన్నాయి. మొత్తం కార్పొరేటర్లలో 5 నుంచి 10 మంది మినహా మిగిలిన వారందరూ అక్రమ భవనాల నుంచి వసూలుచేసిన అవినీతి సొమ్ములతోనే భోగ భాగ్యాలు అనుభవిస్తున్నారన్న విషయం నగరంలో బహిరంగ రహస్యమే. ప్రస్తుతం జరుగుతున్న అక్రమ భవనాల సర్వేతో టీడీపీ కార్పొరేటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తుండగా, ఈ సర్వేను అర్ధాంతరంగా నిలిపివేసేందుకు ప్రభుత్వ పెద్దలతో ఒత్తిడికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.