విజయవాడ

దేశ సేవలో విద్యార్థినిలు ముందుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 16: దేశ సేవలో విద్యార్థినిలు ముందుండాలని ఎన్‌సీసీ బెటాలియన్ ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ జితేంద్రకుమార్ సూచించారు. స్థానిక ఎల్బీఆర్సీఇ ఎన్‌సీసీ విభాగం విద్యార్థినిలతో ఎన్‌సీసీలో ఉద్యోగ అవకాశాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో జితేంద్రకుమార్ మాట్లాడుతూ ఎన్‌సీసీ విభాగం ద్వారా రక్షణదళంలో, దేశ సరిహద్దులలో పురుషులతోపాటు మహిళలకు కూడా మంచి అవకాశాలున్నాయన్నారు. కళాశాల చైర్మన్ లకిరెడ్డి ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్‌సీసీ ఆర్మీ విభాగాలలో చేరే విద్యార్థినిలు గొప్పవారన్నారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థినిలు ఎక్కువ మంది రాబోయే రోజులలో ప్రభుత్వ కార్యక్రమాలలో ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన గణతంత్ర వేడుకలలో తమ కళాశాలకు చెందిన బాలిక పరేడ్‌కు ఎంపికవటం గర్వకారణమన్నారు. ఆ బాలికను అందరూ ఆదర్శం కావాలన్నారు. అదేవిధంగా విజయవాడలో జరిగిన పరేడ్‌లో తమ కళాశాలకు చెందిన బాలిక ఎంపికైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇంకా ఈకార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె అప్పారావు, విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఢిల్లీ పరేడ్‌కు ఎంపికైన కిరణ్మయి, విజయవాడ పరేడ్‌కు ఎంపికైన జె స్వప్నలను అతిధులు అభినందించారు.

రాజధాని నగరంలో టోక్యో తరహా ట్రాఫిక్ సిస్టమ్
* కాంప్రహెన్సివ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌పై అధ్యాయనం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 16: రాష్ట్ర రాజధాని అమరావతి నగరాల్లో ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రపంచ స్థాయి విధానాలను అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రథమంగా వినిపించే జపాన్ దేశ రాజధాని టోక్యో నగరంలో అనుసరిస్తున్న ట్రాఫిక్ సిస్టమ్‌ను అధ్యాయనం చేస్తున్నారు. ఈక్రమంలో సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ నేతృత్వంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతంసవాంగ్, సీఆర్‌డీఏ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్‌ఆర్ అరవింద్ తోపాటు పలువురు ఉన్నతాధికారులు శుక్రవారం టోక్యో నగరంలోని పోలీస్ శాఖ మెట్రోపాలిటన్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ విధానాలను స్వయంగా పరిశీలించిన అధికారుల బృందం, జపాన్ అధికార బృందంతో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గురించి చర్చించారు.
టోక్యో మెట్రోపాలిటన్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ ద్వారా ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్‌ను యూవీ సెన్సర్స్, వెహికల్ టిటెక్షన్ లూప్స్, కెమెరాలతో సేకరించడం జరుగుతుందని, ట్రాఫిక్‌ను అనుసరించి కంట్రోలింగ్ వ్యవస్థను ఈ సెంటర్ ద్వారా మానిటరింగ్ చేస్తామని వివరించారు. ఎఫ్‌ఎం రేడియో, రోడ్లపై ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే బోర్డుల ద్వారా ప్రజలకు సమాచారం తెలపడం, ఇంటర్నెట్ ద్వారా మొబైల్ అండ్ నేవిగేషన్ సిస్టమ్‌తో రియల్ టైమ్ ట్రాఫిక్ డేటాను తెలుసుకునే సదుపాయాలను పరిశీలించిన సీఆర్‌డీఏ అధికారిక బృందం అత్యంత ఆధునిక సదుపాయమైన ఆల్ట్రా మోడరన్ సెంటర్‌ను అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల ట్రాఫిక్ సిస్టమ్ అమలుకు గల సాధ్యాసాధ్యాలపై అవగాహన కలిగినట్టు తెలిపారు.
ఎంబసీ ఆఫ్ ఇండియా అంబాసిడర్‌తో సమావేశమైన సీఆర్‌డీఏ అధికారులు అమరావతి నగర అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. అమరావతి అభివృద్ధిలో జపనీస్ పెట్టుబడులను భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తున్నట్టు కమిషనర్ శ్రీ్ధర్ తెలుపగా రాజధాని నిర్మాణంలో సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్న కృషిని అంబాసిడర్ ప్రశంసించినట్టు పేర్కొన్నారు.