విజయవాడ

పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో ఈ-విజిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించటంతో పాటు పారదర్శక పరిపాలన అందించేందుకు కృష్ణాజిల్లాలో ‘ఈ-విజిట్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం అన్నారు.
నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతం మాట్లాడుతూ డ్రోన్స్ సహాయంతో అందించే విధంగా జిల్లాలో విజయవాడ నగరంతో పాటు 5గ్రామ పంచాయతీల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఈ-విజిట్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ-విజిట్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, రాష్ట్రంలోనే వినూత్నంగా జిల్లాలో ఈ-విజిట్ అమలు చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. విజయవాడ నగరం, ఆత్కూరు, పెదపారపూడి, కంకిపాడు, గూడూరు, పామర్రు, గ్రామ పంచాయతీల్లో ఈ పైలెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో రహదార్ల పరిస్థితి, చెత్తా చెదారం ఏ ప్రాంతంలో ఉన్నదీ, మురుగునీటి డ్రైన్లు ఏ విధంగా ఉన్నది, మొక్కలు పెంపకం గురించి, గ్రామాభివృద్ధికి చేపట్టవలసిన పనులు, ఇతర అవసరాలను గుర్తించి ప్రణాళికబద్ధంగా పని చేసేందుకు డ్రోన్ల సహాయంతో సమాచారాన్ని సేకరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ-ఆడిట్
2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ-ఆడిట్ అమలు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. దీనిలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ-ఆడిట్ అమలు వలన ఎటువంటి అవకతవకలకు తావులేకుండా గ్రామ పంచాయతీల్లో పారదర్శకమైన పాలన అందుతుందని కలెక్టర్ అన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని గ్రామ పంచాయతీలు అప్ లోడ్ చేసి ఈ-ఆడిట్ పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ విధానం వలన సమయం, డబ్బు ఆదా అవుతుందని కలెక్టర్ అన్నారు.
ఈ-హాస్పటల్స్
జిల్లాలో మచిలీపట్నం, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ-హాస్పటల్ విధానాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. హాస్పటల్లో రోగులకు అందుతున్న సౌకర్యాలు, మెరుగైన శానిటేషన్, మంచినీరు, విద్యుత్ శక్తి, వైద్య పరికరాలు, మొదలగు పూర్తి సమాచారాన్ని ఈ విధానంలో పొందుపరుచుతున్నామని కలెక్టర్ అన్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు ప్రజలకు అందించటంతో పాటు రోగుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్ అన్నారు.
డ్రోన్ల ద్వారా వ్యవసాయాభివృద్ధి
వ్యవసాయంలో వినూత్న మార్పుల ద్వారా రైతుకు తక్కువ ఖర్చుతో పాటు అధిక దిగుబడి సాధించే విధంగా ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేస్తోందని కలెక్టర్ అన్నారు. ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటం ద్వారా రైతుకు వ్యవసాయంలో జీరో బడ్జెట్ తీసుకురాగాలమని కలెక్టర్ అన్నారు. పురుగు మందులు డ్రోన్స్ ద్వారా స్ప్రే చేయుట ద్వారా సమయాన్ని, డబ్బు ఆదాయ చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. గంటకు 500 ఎకరాలు డ్రోన్స్ ద్వారా పురుగు మందులు స్ప్రే చేయవచ్చని కలెక్టర్ అన్నారు. రైతులకు అటువంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని కలెక్టర్ బీ.లక్ష్మీకాంతం అన్నారు.