విజయవాడ

ప్రతి ఎకరానికి నీరందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: రైతులందరికీ సాగునీరు అందించే బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందని, జిల్లాలో ఏ ఒక్క ఎకరం పంట నీరు లేక నష్టపోకూడదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ బి లక్ష్మీకాంతంతో కలిసి జిల్లా అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో అవనిగడ్డ, గూడూరుల్లో ఆరుతడి పంటలకు నీరులేదని రైతుల నుండి విజ్ఞాపనలు అందాయని, ఈ విషయమై వ్యవసాయ శాఖ, ఇరిగేషన్, రెవెన్యూ వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా మండలాల్లో నీటి వనరుల ద్వారా పంటలను సంరక్షించేలా పనులు చేపట్టాలని, మంత్రి అన్నారు. జిల్లాలోని తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయనున్నామని ముందుగా తాగునీటి అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు అనంతరం మూడవ ప్రాధాన్యతగా చేపల చెరువులకు నీటిని విడుదల చేస్తామని మంత్రి అన్నారు. తిరువూరు, నందిగామ మండలాల్లో సాగర్ కాలువ ద్వారా పంటలకు నీరు అందిస్తున్నామని మంత్రి అన్నారు. 116 రోజుల జలసంరక్షణ కార్యక్రమాన్ని జిల్లా అంతటా అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు. భూగర్భజలాల పెంపుదలకు కృష్ణా జిల్లాలో అనేక పనులు చేపట్టడం ద్వారా కొంతవరకు ఆశించిన ప్రగతిని సాధించామని మంత్రి అన్నారు. జిల్లాలో భూగర్భజలాలకు సంబంధించి జీరో నుండి మూడు మీటర్లు వాటర్ లెవల్ తొమ్మిది మండలాల్లో ఉన్నదన్నారు. అవి కృత్తివెన్ను, మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక, గూడూరు, కైకలూరు, కలిదిండి, మోపిదేవి, కంచికచర్ల మండలాలని మంత్రి అన్నారు. 15 మండలాల్లో మూడు నుండి 8 మీటర్లు వాటర్ లెవెల్ ఉందని అవి పమిడిముక్కల, తిరువూరు, గుడివాడ, చందర్లపాడు, చల్లపల్లి, అవనిగడ్డ, మొవ్వ, ఘంటసాల, తోట్లవల్లూరు, వత్సవాయి, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, వీరుళ్లపాడు, గంపలగూడెం, మైలవరం మండలాలలని మంత్రి తెలియచేశారు. 10 మండలాల్లో 12 నుండి 16 మీటర్ల మధ్య వాటర్ లెవెల్ ఉందని అవి బంటుమిల్లి, మండవల్లి, ముదినేపల్లి, నందివాడ, ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, విజయవాడ రూరల్ మండలాలని మంత్రి తెలియజేశారు. 16 నుండి 20 మీటర్లు వాటర్ లెవెల్ ఉన్న రెండు మండలాలు బాపులపాడు, గన్నవరం మండలాలని మంత్రి పేర్కొన్నారు. 20 మీటర్లు వాటర్ లెవల్ ఉన్న మండలాలు ఆగిరిపల్లి, చాట్రాయి, నూజివీడు, ముసునూరు మండలాలని మంత్రి అన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో జల సంరక్షణ చర్యలు విస్తృత స్థాయిలో చేపట్టాలని ప్రభుత్వం నీరు - చెట్టు మొదలగు అనేక కార్యక్రమాల ద్వారా పనులను చేపడుతుందని మంత్రి అన్నారు. నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలను, ఇళ్లను అందిస్తున్నదని, ఇందుకు మండలాల వారీగా తహశీల్దార్లు అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు అందించేవిధంగా కృషి చేయాలని మంత్రి అన్నారు. జిల్లాలో ఇంతవరకు 31,500 మందికి ఇళ్ల స్థలాలు అందించామని, మరో 16 వేల ఇళ్ల స్థలాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మంత్రి అన్నారు.కలెక్టర్ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామంలోనూ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును ఆయా మండలాల ప్రత్యేకాధికారులు గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా సమీక్షించాలని కలెక్టర్ అన్నారు. ప్రతి బుధవారం మండల ప్రత్యేకాధికారులు, జిల్లా అధికారులు తప్పనిసరి పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమై వారి సమస్యలను విని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 11 వందల కోట్లు రైతులకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని, మార్చిలోగా మరో 300 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలుగా అందజేయనున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ్ కృష్ణన్, జేసీ-2 పి.బాబూరావు, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖరరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.