విజయవాడ

3 జిల్లాల్లో 14మంది ఈవోలకు పదోన్నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 23: ఏపీలోని 3 జిల్లాలకు చెందిన 14 మంది ఈవోలకు గ్రేడ్-3 నుండి గ్రేడ్-2కు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ వైవీ అనూరాధ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లాలో 8మంది ఈవోలు, ఒక సీనియర్ అసిస్టెంట్ ఉండగా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఐదుగురు ఈవోలకు ఈపదోన్నతులు లభించాయి. కొనే్నళ్లుగా ఈవోలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పలుసార్లు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై పరిశీలించిన కమిషనర్ వైవీ అనూరాధ వీరికి పదోన్నతులు కల్పిస్తూ జివోను విడుదల చేశారు. పదోన్నతులు పొందిన ఈవోలు జాయినింగ్ రిపోర్ట్ చేసేందుకు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. పదోన్నతులు పొందిన వారిలో నగరానికి చెందిన శ్రీ రూపాబాయమ్మ ట్రస్ట్ ఈవో ఎం సత్య ప్రసాద్, కొత్తపేట ఆంజనేయవాగు సెంటర్ శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం ఈవో పీ రమేష్‌బాబు, గవర్నపేట సుబ్బారావు ట్రస్ట్ ఈవో సీహెచ్‌వీవీ శ్రీనివాసరావు, కొత్తపేట ఇంద్రకీలాద్రి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఈవో జీ శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు. ఇదేవిధంగా గుడివాడకు చెందిన ఎస్‌వీఎస్ శంకర్, చల్లపల్లికి చెందిన సుధాకర్, తోటపల్లి ఈవో రాంబాబు, కృష్ణాజిల్లా బలివే దేవస్థానం ఈవో నాగ సురేష్, తదితరులు పదోన్నతులు పొందారు. యనమలకుదురు కొండపైనున్న శ్రీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గంగాధర్‌కు గ్రేడ్-3 ఇవోగా పదోన్నతి లభించింది. ఇదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఐదుగురు ఈవోలకు పదోన్నతులు లభించాయి. పదోన్నతులు పొందిన ఈవోలు గురువారం ఉదయం దేవదాయశాఖ సహాయ కమిషనర్ వీ సత్యనారాయణను మర్యాద పూర్వకంగా కలిశారు. పదోన్నతులు పొందిన ఈవోల స్థానంలో 3జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలో గ్రేడ్-2 ఈవో పోస్ట్‌లు 5 ఖాళీగా ఉన్నాయి.

సోము వీర్రాజు పద్దతి మార్చుకోవాలి
* పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాలో మాట్లాడటం గర్హనీయమని పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు. 5కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదాకు విరుద్ధంగా మాట్లాడుతున్న తీరును మార్చుకోవాలని హితవు పలికిన శివాజీ, ఏపీకి మోదీ సర్కారు చేస్తున్న అన్యాయంపై సీఎం చంద్రబాబు నాయుడు సైతం గళమెత్తడం, ఎంపీల చేత పార్లమెంటులో ఆందోళన చేయించడం మంచి పరిణామమే కాగా వీర్రాజు మాత్రం రాష్ట్ర ప్రయోజనాల గురించి లేనిపోని కట్టుకథలు వినిపిస్తున్నారని విమర్శించారు. యూపీఏ సర్కారు రూపొందించిన విభజన చట్టం, రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, తదితరాలను ఇచ్చేందుకు బీజేపీ సైతం అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల నుంచీ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంటే పట్టించుకోని వీర్రాజు, హోదా ఉద్యమం హోరెత్తుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడటం అప్రజాస్వామికమని, తక్షణమే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధైర్యముంటే ఢిల్లీ వెళ్లి తన అధిష్టానంపై పోరాడి హోదా సాధించాలన్నారు. మార్చి 4,5,6న మోదీ సర్కార్‌పై మరింత ఒత్తిడి తీసుకుచ్చేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతున్నట్టు శివాజీ తెలిపారు. సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విధంగా అఖిల పక్ష సమావేశం నిర్వహించి హోదాపై పోరును ఉధృతం చేయాలని, జెండాలను పక్కన పెట్టి ఉద్యమిస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం సాధ్యమవుతుందని తెలిపారు.